తెలంగాణలో లాక్ డౌన్ విధింపు నేపథ్యంలో భారీగా మద్యం
అమ్మకాలు జరుగుతున్నాయి. వైన్ షాప్ ఓనర్లు గత మూడోరోజులుగా రికార్డు స్థాయిలో డిపోల నుండి రికార్డు స్థాయిలో మద్యం కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 11 వ తేదీ 125 కోట్ల 39 లక్షల అమ్మకాల జరగ్గా, లాక్ డౌన్ అమల్లోకి వచ్చిన 12 వ తేదీ నాడు డిపోల వద్ద 157 కోట్ల మద్యం కొనుగోలు చేశారు. ఇక 1 3 వ తేది మళ్లీ 135 కోట్ల అమ్మకాలు జరిగాయి. దీంతో 3 రోజుల్లోనే భారీ స్థాయిలో 417 కోట్ల మద్యం ను వైన్ షాప్ యజమానులు డిపోల నుంచి కొనుగోలు చేశారు. ఇక ఈ సంఖ్య రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
No comments:
Post a Comment