అమరావతి- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకు విస్తరిస్తోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కరోనా సెకండ్ వేవ్ విజృంబిస్తోంది. కరోనా కేసుల పెరుగుదల నేపధ్యంలో ఇప్పటికే పాక్షిక లాక్ డౌన్ విధించింది జగన్ సర్కార్. అయినప్పటికీ కరోనా కేసులు ఆగడం లేదు. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై వైద్య నిపుణులు సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో పెరుగుతున్న కేసులు, మందుల కొరత, వ్యాక్సిన్ల లేమి, ఆసుపత్రులలో దక్కని బెడ్లు, ఆక్సిజన్ అందక పోతున్న ప్రాణాలు, ప్రైవేట్ ఆసుపత్రుల నిలువు దోపిడీ.. ఇలా ఒక్కటేమిటి అన్నీ కలిసి ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సంపూర్ణలాక్ డౌన్ విధిస్తే ఎలా ఉంటుందన్న దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. సీఎం జగన్ కరోనాపై నిర్వహించిన పలు సమీక్షా
సమావేశాల్లోను అధికారులు ఇదే అభిప్రాయాన్ని
వ్యక్తం చేశారట.
సంపూర్ణ లాక్ డౌన్ లేఅమలు చేయకపోతే కరోనా కేసులు కంట్రోల్ కావడం కష్టమేనని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. పూర్తి లాక్ డౌన్ పై ముఖ్యమంత్రి జగన్ మరోసారి వైద్య నిపుణులు, అధికారులతో చర్చించి ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. కనీసం 14 రోజుల పాటు ఏపీలో సంపూర్ణ లాక్ డౌని విధిస్తారన్న చర్చ జరుగుతోంది. ఐతే సంపూర్ణ లాక్ డౌన్ విధించడానికి ముందు ప్రజలకు కనీసం ఒక రోజు సమయం ఇవ్వాలని జగన్ భావిస్తున్నారట. మరోవైపు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో గందరగోళం నెలకొంది.
మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఇక్కడ సరిహద్దులను
మూసేస్తున్నారు. దీంతో కరోనా రోగులు తెలంగాణ
No comments:
Post a Comment