సాధారణంగా కొందరికి ఫుడ్ స్పైసీగా ఉంటే మహా ఇష్టం.అందుకోసం కారాన్ని ఎక్కువగా వినిపయోగిస్తారు.
కారం ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక జబ్బులను తెచ్చిపెట్టుకున్నట్టే అవుతుంది.అవును, మోతాదుకు మించి కారాన్ని తీసుకుంటే.
అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.మరి అవేంటో లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.
చికాకు, చురుకుతనం తగ్గడం, తలనొప్పి వంటి సమస్యలు ఏర్పడతాయి.అలాగే కారం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆకలి కూడా ఎక్కువగా ఉంటుంది.ఈ క్రమంలోనే ఏది పడితే అది లాంగించేస్తారు.ఫలితంగా బరువు పెరుగి పోతారు.
కారాన్ని అతిగా వాడటం వల్ల జీర్ణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడి.గ్యాస్, ఎసిడిటీ, ఛాతిలో మంట, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు ఏర్పడతాయి.
ఇక కారాన్ని ఓవర్గా వాడటం వల్ల తరచూ తల తిరుగుడు, కళ్ళు బైర్లు కమ్మడం వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి.
కారాన్ని ఓవర్గా కాకుండా తగిన మోతాదులో మాత్రమే తీసుకోండి
No comments:
Post a Comment