చేతికి సెలైన్ పైపు.. నోటికి ఆక్సిజన్ పైపు.. కోవిడ్ రోగుల మధ్య హాస్పిటల్లో చికిత్స.. అయినా ఆ 30 ఏళ్ల యువతి భయపడలేదు. ఆస్పత్రి బెడ్ మీద భయంకర పరిస్థితుల్లో ఉంటూనే పాటలు వింటూ ఆనందంగా కనిపించింది. `లవ్ యూ జిందగీ' పాట వింటూ ఆమె ధైర్యంగా చికిత్స తీసుకుంటున్న వీడియోను ఢిల్లీకి చెందిన డాక్టర్ మోనిక తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
గత వారం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ వీడియో ఎంత మందిలో స్ఫూర్తి నింపింది. అయితే ఆమె ధైర్యం కరోనా ముందు ఓడిపోయింది. పరిస్థితి క్రిటికల్‌గా మారడంతో ఆమె గుండె ఆగిపోయింది. గురువారం ఆమె తుదిశ్వాస విడిచింది. `చాలా బాధాకరం. ఓ ధైర్యమైన గుండెను కోల్పోయాం` అంటూ మోనిక ఆమె మరణ వార్తను తెలియజేశారు. దీంతో ఎంతో
మంది దిగ్భ్రాంతికి గురవుతున్నారు.
No comments:
Post a Comment