Thursday, June 24, 2021

209 సామెతలు మీకోసం

209 సామెతలు మీకోసం 

👍మరుగున ( మడుగున) పడుతున్న కొన్ని తెలుగు సామెతలు.

*Please Share all Telugu People*

1. అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు
2. అంబలి తాగే వారికి మీసాలు యెగబట్టేవారు కొందరా
3. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ
4. అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు
5. అనువు గాని చోట అధికులమనరాదు
6. అభ్యాసం కూసు విద్య
7. అమ్మబోతే అడివి కొనబోతే కొరివి
8. అయితే ఆదివారం కాకుంటే సోమవారం
9. ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం
10. ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత
11. ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు
12. ఇంట గెలిచి రచ్చ గెలువు
13. ఇల్లు పీకి పందిరేసినట్టు
14. ఎనుబోతు మీద వాన కురిసినట్టు
15. చెవిటి వాని ముందు శంఖమూదినట్టు
16. కందకు లేని దురద కత్తిపీటకెందుకు
17. కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పదు
18. కుక్క కాటుకు చెప్పుదెబ్బ
19. కోటి విద్యలూ కూటి కొరకే
20. నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు
21. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం
22. పిట్ట కొంచెం కూత ఘనం
23. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు
24. వాన రాకడ ప్రాణపోకడ ఎవరి కెరుక
25. కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదు
26. మింగమెతుకులేదు మీసాలకు సంపంగి నూనె
27. ఆడబోయిన తీర్థము యెదురైనట్లు
28. ఆడలేక మద్దెల వోడు అన్నట్లు
29. ఆది లొనే హంస పాదు
30. ఏమీ లేని యెడారిలో ఆముదము చెట్టే మహా వృక్షము
31. ఆకలి రుచి యెరుగదు నిద్ర సుఖమెరుగదు
32. ఆకాశానికి హద్దే లేదు
33. ఆలస్యం అమృతం విషం
34. ఆరే దీపానికి వెలుగు యెక్కువ
35. ఆరోగ్యమే మహాభాగ్యము
36. ఆవులింతకు అన్న ఉన్నాడు కాని తుమ్ముకు తమ్ముడు లేడంట
37. ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా?
38. అబద్ధము ఆడినా అతికినట్లు ఉండాలి
39. అడగందే అమ్మైనా అన్నము పెట్టదు
40. అడ్డాల నాడు బిడ్డలు కాని గడ్డాల నాడు కాదు
41. ఏ ఎండకు ఆ గొడుగు
42. అగ్నికి వాయువు తోడైనట్లు
43. ఐశ్వర్యమొస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమంటాడు
44. అందని మామిడిపండ్లకు అర్రులు చాచుట
45. అందితే జుట్టు అందక పోతే కాళ్ళు
46. అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని ఉన్నట్లు
47. అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేదు
48. అప్పు చేసి పప్పు కూడు
49. అయ్య వారు వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా
50. అయ్యవారిని చెయ్యబొతే కోతి బొమ్మ అయినట్లు
51. బతికుంటే బలుసాకు తినవచ్చు
52. భక్తి లేని పూజ పత్రి చేటు
53. బూడిదలో పోసిన పన్నీరు
54. చాదస్తపు మొగుడు చెబితే వినడు,
గిల్లితే యేడుస్తాడు
55. చాప కింద నీరులా
56. చచ్చినవాని కండ్లు చారెడు
57. చదివేస్తే ఉన్నమతి పోయినట్లు
58. విద్య లేని వాడు వింత పశువు
59. చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ
60. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు
61. చక్కనమ్మ చిక్కినా అందమే
62. చెడపకురా చెడేవు
63. చీకటి కొన్నాళ్ళువెలుగు కొన్నాళ్ళు
64. చెరువుకి నీటి ఆశ నీటికి చెరువు ఆశ
65. చింత చచ్చినా పులుపు చావ లేదు
66. చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే,
ఆ వంకర టింకరవి యేమి కాయలని అడిగిందట
67. చిలికి చిలికి గాలివాన అయినట్లు
68. డబ్బుకు లోకం దాసోహం
69. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు
70. దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన
71. దాసుని తప్పు దండంతో సరి
72. దెయ్యాలు వేదాలు పలికినట్లు
73. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు
74. దొంగకు దొంగ బుద్ధి, దొరకు దొర బుద్ధి
75. దొంగకు తేలు కుట్టినట్లు
76. దూరపు కొండలు నునుపు
77. దున్నపోతు మీద వర్షం కురిసినట్లు
78. దురాశ దుఃఖమునకు చెటు
79. ఈతకు మించిన లోతే లేదు
80. ఎవరికి వారే యమునా తీరే
81. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు
82. గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె అందానికి గాడిద మూర్ఛ పోయిందంట
83. గాజుల బేరం భోజనానికి సరి
84. గంతకు తగ్గ బొంత
85. గతి లేనమ్మకు గంజే పానకం
86 గోరు చుట్టు మీద రోకలి పోటు
87. గొంతెమ్మ కోరికలు
88. గుడ్డి కన్నా మెల్ల మేలు
89. గుడ్డి యెద్దు చేలో పడినట్లు
90. గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు
91. గుడినే మింగే వాడికి లింగమొక లెఖ్ఖా
92. గుడిని గుడిలో లింగాన్నీ మింగినట్లు
93. గుడ్ల మీద కోడిపెట్ట వలే
94. గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నాడట
95. గుర్రము గుడ్డిదైనా దానాలో తక్కువ లేదు
96. గురువుకు పంగనామాలు పెట్టినట్లు
97. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు
98. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు
99. ఇంటి పేరు కస్తూరివారు వీధిలో గబ్బిలాల కంపు
100. ఇంటికన్న గుడి పదిలం
101. ఇసుక తక్కెడ పేడ తక్కెడ
102. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట
103. కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు
104. కాగల కార్యము గంధర్వులే తీర్చినట్లు
105. కాకి ముక్కుకు దొండ పండు
106. కాకి పిల్ల కాకికి ముద్దు
107. కాలం కలిసి రాక పోతే కర్రే పామై కాటు వేస్తుంది
108. కాలు జారితే తీసుకోగలము కాని నోరు జారితే తీసుకోగలమా
109. కాసుంటే మార్గముంటుంది
110. కడుపు చించుకుంటే కాళ్ళపైన పడ్డట్లు
111. కలకాలపు దొంగ ఏదో ఒకనాడు దొరుకును
112. కలి మి లేములు కావడి కుండలు
113. కలిసి వచ్చే కాలం వస్తే, నడిచి వచ్చే కొడుకు పుడతాడు
114. కంచే చేను మేసినట్లు
115. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా !
116. కందకు కత్తి పీట లోకువ
117. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం
118. కీడెంచి మేలెంచమన్నారు
119. కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడినట్లు
120. కొండల్లే వచ్చిన ఆపద కూడా మంచువలే కరిగినట్లు
121. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు
122. కొన్న దగ్గిర కొసరే గాని కోరిన దగ్గర కొసరా
123. కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందిట
124. కూటికి పేదైతే కులానికి పేదా
125. కొరివితో తల గోక్కున్నట్లే
126. కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు
127. కొత్తొక వింత పాతొక రోత
128. కోటిి విద్యలు కూటి కొరకే
129. కొత్త అప్పుకు పొతే పాత అప్పు బయటపడ్డదట
130. కొత్త బిచ్చగాడు పొద్దు యెరగడు
131. కృషితో నాస్తి దుర్భిక్షం
132. క్షేత్ర మెరిగి విత్తనము పాత్ర మెరిగి దానము
133. కుడుము చేతికిస్తే పండగ అనేవాడు
134. కుక్క వస్తే రాయి దొరకదు రాయి దొరికితే కుక్క రాదు
135. ఉన్న లోభి కంటే లేని దాత నయం
136. లోగుట్టు పెరుమాళ్ళకెరుక
137. మెరిసేదంతా బంగారం కాదు
138. మంచమున్నంత వరకు కాళ్ళు చాచుకో
139. నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది
140. మంది యెక్కువయితే మజ్జిగ పలచన అయినట్లు
141. మనిషి మర్మము.. మాను చేవ...
బయటకు తెలియవు
142. మనిషి పేద అయితే మాటకు పేదా
143. మనిషికి మాటే అలంకారం
144. మనిషికొక మాట పశువుకొక దెబ్బ
145. మనిషికొక తెగులు మహిలో వేమా అన్నారు
146. మంత్రాలకు చింతకాయలు రాల్తాయా
147. మీ బోడి సంపాదనకుఇద్దరు పెళ్ళాలా
148. మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అయ్యిందట
149. మొక్కై వంగనిది మానై వంగునా
150. మొరిగే కుక్క కరవదు కరిసే కుక్క మొరగదు
151. మొసేవానికి తెలుసు కావడి బరువు
152. ముల్లును ముల్లుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతొనే కొయ్యాలి
153. ముందర కాళ్ళకి బంధాలు వేసినట్లు
154. ముందుకు పోతే గొయ్యి వెనుకకు పోతే నుయ్యి
155. ముంజేతి కంకణముకు అద్దము యెందుకు
156. నడమంత్రపు సిరి నరాల మీద పుండు
157. నేతి బీరకాయలో నెయ్యి యెంత ఉందో నీ మాటలో అంతే నిజం ఉంది
158. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా
159. నవ్వు నాలుగు విధాలా చేటు
160. నీ చెవులకు రాగి పొగులే అంటే అవీ నీకు లేవే అన్నట్లు
161. నిదానమే ప్రధానము
162. నిజం నిప్పు లాంటిది
163. నిమ్మకు నీరెత్తినట్లు
164. నిండు కుండ తొణకదు
165. నిప్పు ముట్టనిదే చేయి కాలదు
166. నూరు గొడ్లు తిన్న రాబందుకైనా ఒకటే గాలిపెట్టు
166. నూరు గుర్రాలకు అధికారయినా, భార్యకు యెండు పూరి
167. ఆరు నెళ్ళు సావాసం చేస్తే వారు వీరు అవుతారు
168. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు
169. ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బ్రతకవచ్చు
170. బతికి ఉంటే బలుసాకు తినవచ్చు
171. ఊరంతా చుట్టాలు ఉత్తికట్ట తావు లేదు
172. ఊరు మొహం గోడలు చెపుతాయి
173. పనమ్మాయితొ సరసమ్ కంటే అత్తరు సాయిబు తో కలహం మేలు
174. పాము కాళ్ళు పామునకెరుక
175. పానకంలో పుడక  
176. పాపమని పాత చీర ఇస్తే గోడ చాటుకు వెళ్ళి మూర వేసిందట
177. పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనపడినట్లు
178. పండిత పుత్రః పరమశుంఠః
179. పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్లు
180. పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు
181. పట్టి పట్టి పంగనామం పెడితే, గోడ చాటుకు వెళ్ళి చెరిపేసుకున్నాడట
182. పెదవి దాటితే పృథ్వి దాటుతుంది
183. పెళ్ళంటే నూరేళ్ళ పంట
184. పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్ళినట్టు
185. పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరికిందట
186. పెరుగు తోట కూరలో, పెరుగు యెంత ఉందో, నీ మాటలో అంతే నిజం ఉంది
187. పిచ్చి కోతికి తేలు కుట్టినట్లు
188. పిచ్చోడి చేతిలో రాయిలా
189. పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా
190. పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం
191. పిండి కొద్దీ రొట్టె
192. పిట్ట కొంచెము కూత ఘనము
193. పోరు నష్టము పొందు లాభము
194. పోరాని చోట్లకు పోతే , రారాని మాటలు రాకపోవు
195. పొర్లించి పొర్లించి కొట్టినా మీసాలకు మన్ను కాలేదన్నదడట
196. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు
197. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు
198. రాజు గారి దివాణంలో చాకలోడి పెత్తనము
199. రామాయణంలో పిడకల వేట
200. రామాయణం అంతా విని రాముడికి సీత యేమౌతుంది అని అడిగినట్టు
201. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలనట్లు
202. రెడ్డి వచ్చే మొదలెట్టు అన్నట్టు
203. రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు
204. రౌతు కొద్దీ గుర్రము
205. ఋణ శేషం శత్రు శేషం ఉంచరాదు
206. చంకలో పిల్లవాడిని ఉంచుకుని ఊరంతా వెతికినట్టు
207. సంతొషమే సగం బలం
208. సిగ్గు విడిస్తే శ్రీరంగమే
209. శివుని ఆజ్ఞ లేక చీమైనా కుట్టదు.
*🗣️🌎🕉️🌞🎁🧲నేను సైతం DrBoppas ధన్యవాదములు 🙏🙏🙏*

Sunday, June 13, 2021

రైలు బండిలో మనకు బెర్త్ రిజర్వేషన్ నెంబర్లు.. ఏ క్రమంలో కేటాయిస్తారో తెలుసా.?

 రైలు బండిలో మనకు బెర్త్ రిజర్వేషన్ నెంబర్లు.. ఏ క్రమంలో కేటాయిస్తారో తెలుసా.?

ఎక్కువమందికి తెలియని (భౌతిక శాస్త్ర సాంకేతిక) ఆసక్తికర సమాచారం.!


సినిమా హాల్లో మనకు నచ్చిన నంబరు సీటును మనం బుక్ చేసుకోవచ్చును.  కాని, IRCTC లో మనం టికెట్లు బుక్ చేసుకునేటపుడు అది మహా అయితే అప్పర్ బెర్త్ కావాలా, మిడిల్ బెర్త్ కావాలా లేక లోయర్ బెర్త్ కావాలా అని మాత్రమే అడుగుతుంది కాని, ఒక బోగీలో 72 బెర్త్ లు ఉంటాయి కదా, అందులో మీరు కోరిన నంబరు బెర్తు కావాలా అని మాత్రం అడుగదు.  ఎందుకు.?   


దీని వెనుక భౌతికశాస్త్రపు ప్రాథమిక సాంకేతికాంశాలు ఉన్నాయి కాబట్టి..!


సినిమాహాలులో సీటు బుకింగు  వేరు, రైలుబండిలో సీటు బుకింగు వేరు.  సినిమా హాలు నిశ్చలంగా ఉండే ఒక విశాలమైన గది మాత్రమే.  కాని, రైలుబండి ఒక పరుగెత్తే గదుల సమూహం.  


ఆ పరుగు ప్రయాణీకులకు ప్రమాదకరంగా ఉండరాదు, వారి ప్రయాణం క్షేమంగా జరగాలన్నది చాల ముఖ్యమైన విషయం.  


అందువల్ల రైలుబండిలో ప్రయాణమయ్యే బరువు బండి అంతటా సమానంగా పంపకమయ్యే విధంగా భారతీయ రైల్వే టికెట్ బుకింగ్ విధానపు సాఫ్ట్ వేర్ ను రూపుదిద్దారు. 


ఉదాహరణకు – ఒక రైలుబండిలో S1 నుండి S10 వరకు స్లీపర్ క్లాసు బోగీలు ఉన్నాయనుకుందాం.  ఒకొక్క బోగీలో 72 సీట్లు ఉంటాయి.  అందువల్ల, మొట్టమొదట టికెట్ బుక్ చేసుకునేవారికి నడుమనున్న బోగీలో (S5 లేదా S6లో) టికెట్ కేటాయింపబడుతుంది.  పైగా అందులో కూడా, 30 – 40 నంబరు సీటు కేటాయింపబడుతుంది.  అందులోనూ, లోయర్ బెర్త్ కేటాయింపబడుతుంది.  (ఎటువంటి బెర్త్ కావాలో మన ఎంపిక లేకపోతే)   రైలుబండిలో గ్రావిటీ సెంటర్లు (గరిమనాభి కేంద్రాలు) సాధ్యమైనంత తక్కువగా ఉండేందుకు గాను, అప్పర్ బెర్త్ ల కంటే ముందుగా లోయర్ బెర్త్ లను కేటాయించడం జరుగుతుంది.  


ఇలా మొదటగా మధ్యలో ఉండే బోగీలలో మధ్య సీట్లు, అలాగే క్రమంగా చివరి సీట్లు, (మొదట లోయర్ బెర్త్, ఆ తరువాతనే అప్పర్ బెర్త్, మిడిల్ బెర్త్) కేటాయింపబడతాయి.  ఆ తరువాత మధ్య బోగీలకు పక్కన ఉండే బోగీలలో (S4, S7) మరలా అదే విధంగా సీట్ల కేటాయింపు జరుగుతూ పోతుంది.  


ఇలా బరువు అన్ని రైలు బోగీలలోనూ సమానంగా ఉండే విధంగా టికెట్ల కేటాయింపు జరుగుతుంది.


మనం చివరి నిమిషాలలో టికెట్ కోసం ప్రయత్నించినపుడు మనకు అప్పర్ బెర్త్ లు, 1-6 లేదా 66-72 నంబరు సీట్లు, కేటాయింపబడటానికి కారణం ఇదే.  మనం వెయిటింగ్ లిస్టులో ఉన్నపుడు ఎప్పుడైనా ఎవరైనా తమ సీటు క్యాన్సిల్ చేసుకుంటే మనకు మధ్యలో కూడా సీటు దొరకవచ్చు. 


ఈ విధానంలో కాకుండా IRCTC తనకు నచ్చిన బోగీలో నచ్చిన సీటును ఇష్టారాజ్యంగా కేటాయించుకుంటూ పోతే ఏం జరుగుతుంది?  


S1, S2, S3  బోగీలు ప్రయాణికులతో నిండుగా కిటకిటలాడుతున్నాయి, S5, S6 బోగీలు ఖాళీగా ఉన్నాయి, మిగిలిన బోగీలలో ప్రయాణికులు అరకొరగా ఉన్నాయనుకుందాం.  ఎక్స్ ప్రెస్ రైలుబండ్లు ఒకొక్కసారి గంటకు 100 కిలోమీటర్లకు పైగా వేగంతో పరుగెడుతుంటాయి.  అంతటి వేగం వలన చాల బలమైన గమనశక్తి పుడుతూ ఉంటుంది.  అంతటి వేగంలో రైలుబండి మలుపు తిరగవలసి వచ్చిందనుకోండి.  ఆ సమయంలో అసమభారం కలిగిన (అనీవెన్లీ లోడెడ్) బోగీలన్నిటిమీద కేంద్రపరాఙ్ముఖబలం (సెంట్రి-ఫ్యూగల్ ఫోర్స్) సమానంగా ఉండటం సాధ్యం కాదు.  అందువల్ల అంతటి వేగంలో బరువు కలిగిన బోగీలు ఒకవైపు ఈడ్వబడితే బరువు లేని బోగీలు మరొకవైపు బలంగా విసిరివేయబడతాయి.  అప్పుడు రైలుబండి పట్టాలు తప్పే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.  


అంతే కాదు, అసమానమైన బరువు కలిగిన బోగీలు రైలుబండిలో ఉన్నపుడు బ్రేకులు వేస్తే అన్ని బోగీలమీదా సమానమైన వత్తిడి పడదు.  అప్పుడు కూడా రైలుబండి చలనం మీద డ్రైవరుకు అదుపు తప్పవచ్చు.  


మాకు అనుకూలమైన సౌకర్యవంతమైన సీట్లు బెర్తులు కేటాయించలేదని రైల్వే రిజర్వేషన్ వ్యవస్థను నిందించే వారికి అసలు విషయాన్ని కారణాలను వివరించేందుకు ఇది ఒక ప్రయత్నం. 


(ఎలైట్ ఫిజిక్స్ అకాడమీ ఫౌండర్, డైరెక్టర్ అయిన శ్రీ అఖిలేశ్ మిశ్రా గారి వ్యాసానికి శ్రీనివాస్ కృష్ణ గారి స్వేచ్ఛానువాదం.)


Friday, June 11, 2021

ఒంగోలులో ఆనందయ్య కరోనాకు మందును ఏడువేల మందికి పంపిణీ

గురువారం.

*ఒంగోలులో ఆనందయ్య కరోనాకు మందును ఏడువేల మందికి పంపిణీ చేసిన*
*ఒంగోలు పార్లమెంట్ సభ్యులు*
*శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు*
*యువజన నాయకులు*
*శ్రీ మాగుంట రాఘవ రెడ్డి గారు*

కరోనాకు ఆనందయ్య మందు దివ్యౌషధంగా పనిచేస్తుందని
ఒంగోలు పార్లమెంట్ సభ్యులు
శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు,
యువనాయకులు
శ్రీ మాగుంట రాఘవ రెడ్డి గారు అన్నారు.
ఒంగోలు పి.వి.ఆర్ మున్సిపల్ హైస్కూలు గ్రౌండ్ లో ఆనందయ్య మందును
శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు,
శ్రీ మాగుంట రాఘవ రెడ్డి గారి
చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈసందర్భంగా మాగుంట మాట్లాడుతూ ఆనందయ్య కరోనాకు మందు తీసుకున్న ప్రజల నుండి వస్తున్న ఫలితాలు మరియు ICMR, ఆయుష్ సూచనలతో ప్రభుత్వ అనుమతితో,ప్రకాశం జిల్లా ప్రజలకు కూడా మందు అందుబాటులోకి తీసుకురావాలని నేను మా  కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఆలోచించి గత నెల 24 వ తేదీ నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని ఆనందయ్య గారిని కలిసి ప్రకాశం జిల్లాలో కూడా మందు పంపిణీకి సహకరించాలని కోరినట్లు, సహృదయంతో జిల్లాలో కరోనాకు మందు పంపిణీకి అవకాశం కల్పించారని,అందులో భాగంగా ప్రస్తుతం ఈరోజు ఆనందయ్య మందు ప్యాకెట్లను  షుమారు 7,000 మందికి పంపిణీ చేయగలిగామని మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు అన్నారు.ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకే కాక అతిత్వరలో జిల్లాలోని ప్రజలందరికీ ఆనందయ్య మందు పంపిణీకి సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
*ప్రజలకు మాగుంట కుటుంబం,ప్రజల అవసరాలను గుర్తెరిగి ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.*

*-మాగుంట కార్యాలయం,ఒంగోలు.*

కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మహానందిలో శుక్రవారం మధ్యాహ్నం సూర్యుని చుట్టూ రంగుల వలయం

ఆకాశంలో మహా అద్భుతం

రాష్ట్రంలో కి నైరుతి రుతపవనాల ఆగమనం తో జిల్లాలో  దాదాపు అన్ని ప్రాంతాల్లో నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. ఈ శుభ సందర్భాన ఆకాశంలో మహా అద్భుతం ఆవిష్కృతమైంది. కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మహానందిలో శుక్రవారం మధ్యాహ్నం సూర్యుని చుట్టూ రంగుల వలయం ఏర్పడడం తో భక్తులు, స్థానికులు ఆసక్తి గా తిలకించారు.

Thursday, June 10, 2021

ఈ రోజూ దేశం వ్యాప్తంగా జూన్ 10 తేదీన కేంద్ర ప్రభుత్వ కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో బజార్ హత్నూర్ మండలం లోప్లకార్డు తో నిరసన చేశారు మరియు MRO నిరసన పత్రం ము ఇవ్వడం జరిగింది ఈ సందర్బంగా ఆదిలాబాద్ సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు com. పవార్ జితేందర్ గారు మాట్లాడాతు దేశం లో covid వ్యాక్సిన్ ఉత్పత్తి వేగంగా పెంచాలి, దేశ ప్రజలందరికి ఉచిత టీకాను ఇవ్వాలి, ఆక్సీజన్, బెడ్ లు ఆరోగ్య వసతు లు మెరుగుపర్చాలి,ప్రభుత్వం ఆరోగ్య వసతులకు అధిక నిధులు ఇవ్వాలి ప్రతి కుటుంబానికి నగదు రూపాయలు 7500ఇవ్వాలి & 10కేజీ బియ్యం, కేరళ ప్రభుత్వం మాదరిగా సరకు ఇవ్వాలి, logdown కాలం లో కార్మికులకు అక్రమంగా తొలంగించోదు అలాగే మూడు నూతన్ నల్ల వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలిలని డిమాండ్ లు చేశారు ఈ కార్యక్రమం లో CITU మండల కన్వీనర్ com.P. శ్రీనివాస్ & హమాలీ యూనియన్ సభ్యులు k. నందు, B. Yegeshwer, B. గంగయ్య, p. మల్లేష్, m. గణేష్, సాయి తుదితురు పాల్గొన్నారు🚩🚩🚩

మంచి ఆయుధం గూర్చి తెలుసుకుందాం

 మంచి ఆయుధం గూర్చి తెలుసుకుందాం.

సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం సామాన్య ప్రజలు గవర్నమెంట్ ఆఫీస్ డైరెక్టుగా వెళ్లి రికార్డ్స్ తనిఖీ చేయొచ్చు మీకు తెలుసా? రోడ్స్,వాటర్, కరెంట్, రేషన్ ఇలాంటి వాటిలో అవినీతి జరిగింది అని మనకు అనిపిస్తే మనం తనిఖీ చేయొచ్చు. దేనికి ఎంత ఖర్చు అయింది రూపాయి రూపాయికి బిల్ చూపియమని అనే అధికారం మనకు ఉంది లెటర్ రూపం లో కూడా అడగచ్చు మొత్తం వివరాలు నాకు పోస్ట్ రూపంలో కావాలి ఒక వేళ సీడి రూపంలో ఇవ్వండి ఆ ఖర్చు నేను బరిస్తా అని తెల్పచ్చు సమాచారం పెద్దగా ఉంటే. అని మన లెటర్ రూపం లో దరఖాస్తు పెట్టొచ్చు సాంపిల్  ఫార్మాట్ కూడా కింద ఉంది. అది  ధెనీ కోసం, నీకెందుకు, ఇవ్వం, అనే అధికారం వాళ్లకు లేదు ఒక వేళ తప్పుడు సమాచారం ఇచ్చిన ఇవ్వము అన్న వాళ్లకు చట్ట ప్రకారం శిక్షలు ఉంటాయి

✒#సమాచారం కోసం #దరఖాస్తు💎
*సమాచార హక్కు చట్టం -2005*
*🕸🕸🕸🕸🕸🕸🕸🕸🕸🕸*
*TO*
*ప్రజా సమాచార అధికారి*
*కార్యాలయం పేరు*
*చిరునామా*
*జిల్లా*

*
#సమాచార #హక్కు #చట్టం #సెక్షన్ 6 (1)ప్రకారం కింది సమాచారాన్ని సెక్షన్ 7 (1) ప్రకారం వీలైనంత త్వరగా లేదా 30 రోజుల్లో సెక్షన్ 2 (జె)(ii)ప్రకారం సర్టిపైడ్ కాఫీలు పంపగలరు*
*REF:1 MS.NO.114 జనరల్ అడ్మినిస్ట్రేషన్ (SER-C)DEPT.DATED.16:03:2009*
*🔜🔄 అయ్యా! నేను కోరుతున్న సమాచారం న్యాయ సంబంధం ప్రజా ప్రయోజనాల నిమిత్తం విన్నపముగా కోరుతున్నాను*

*🔜🔄   తమ కార్యాలయంలో నిర్వహించ వలసిన రిజిస్టర్లు వివరాలు తెలుపగలరు*

*🔜🔄  తమ కార్యాలయంలో సమాచార హక్కు చట్ట పరిధిలో సెక్షన్ 4 (1)(బి)ప్రకారం కార్యాలయ 17 అంశాల ప్రచురణలు తెలుగులో(లేక) లిఖిత పూర్వకంగా సమాచార ఇవ్వగలరు*

*🔜🔄ప్రొద్దుటూరు మండలం.కొత్తపల్లె గ్రామానికి  జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం క్రింద కేటాయించిన బడ్జెట్ నిధుల వివరాలు తెలుపగలరు*

*🔜🔄 కొత్తపల్లె గ్రామంలో ఏ ప్రాతి పధికనపై పనులు కేటాయించారు వాటి వివరాలు తెలుపగలరు*

*🔜🔄 A) గ్రామ పంచాయితీ స్థాయిలో చేపట్టిన పనుల వివరాలు.B) గ్రామానికి కేటాయించిన నిధులు చేసిన నిధుల ఖర్చులు, C) ఈ పథకం కింద గ్రామంలో నిరుద్యోగ భృతి  పొందిన  లబ్ది పొందిన లబ్ది దారులు వివరాలు,D) సెక్షన్ 6 ప్రకారం పేర్కన్న ప్రకారం కూలీ రేటు వివరాలు,E)పని ప్రదేశం లో  కూలీలకు ప్రమాదం కల్గినప్పుడు కూలీలకు అందిస్తున్న మెడిసిన్  మందుల వివరాలు,తెలుపగలరు*

*🔜🔄 A) గ్రామ సభ సామాజిక  తనిఖీలో నిర్వహించిన మస్టర్లు జాబితాలు,B) బిల్లులు.వివరాలు,C)ఓచర్లు,వివరాలు,C) కొలతలు పుస్తకాలు వివరాలు,D)ఆమోద ప్రతులు,ఇతర  సంబంధిత పుస్తకాల జమా ఖర్చులెక్కల కాగితాల వివరాలు ఇవ్వగలరు*

🔜🔄 *నా అనుమతి లేకుండా నాపేరు చిరునామా ఇతరులకు తెలుపరాదని సంబంధిత కార్యాలయ అధికారిగార్కి నా విన్నపం*

*🔜🔄 దరఖాస్తు రుసుం.......నగదు/డిమాండ్ బ్యాంకర్స్ యొక్క చెక్క్/ఇండియన్ పోస్టల్ ఆర్డర్/కోర్టు స్టాంప్ ఫీ (వివరాలు)..........సమాచార హక్కు చట్టం నిబంధనల ప్రకారం చెల్లిస్తున్నాను రశీదు ఇవ్వగలరు కృతజ్ఞతలు.*

*🔜🔄 పైన పేర్కొన్న రెఫరెన్స్1ప్రకారం ఈ దరఖాస్తుకు పూర్తి ఖచ్చితమైన సమాచారం ఇవ్వడంలో విఫలమైనప్పుడు సమాచారం/దరఖాస్తు తిరస్కరింన/అసంపూర్తి సమాచారం/తప్పుదారి పట్టించే సమాచారం/సమాచార నిరాకరణకు పాల్పడిన ప్రజా సమాచార అదికారిపై సివిల్ సర్విసెస్(కండక్ట్)రూల్స్ 1984 ప్రకారం ఎ) శాఖపరమైన చర్యలు తీసుకోవలసిన బాధ్యత కల్గిన అదికారి పేరు.బి)హోదా సి)కార్యాలయ చిరునామాలు.డి)మొబైల్ నంబర్లు.ఇ)ఈమెయిల్ ఐడిలు పంపగలరు.*

సమాచార హక్కు గురించి మీకు పూర్తి అవగాహనా లేకపోతే క్రింది వివరాలు #చూడoడి..#తెలుసుకోండి..#తెలియజేయండి

1😃సెక్షన్-6(1)

సమాచార హక్కు.

2😃సెక్షన్-4(1)Bప్రకారం నెలవారి జీతాలు అదికారులు ప్రజలకు తెలపవలసినదే.

3😃సెక్షన్ -6(3)వారిని కానీ సమాచారం మరో కార్యాలయానికి పంపవలసిన బాద్యత అధికారులదే.

4😃సెక్షన్-7(1)ప్రకారం 30రోజుల లోపు సమాచారము ఇవ్వవలసిందే... వ్యక్తి జీవితానికీ, స్వేచ్ఛకు సoభందించినది ఐతే 48 గంటల లోపే ఇవ్వాలి.

5😃సెక్షన్-19(8) ప్రకారం ధరాఖస్తుదారునకి నష్టపరిహారం వస్తుoది.

6😃సెక్షన్-6(2)ప్రకారం సమాచారము అడిగే హక్కు మనది. "అది మీకెoదుకు" అనే హక్కు అదికారులకు లేదు.

7😃సెక్షన్-21(1)ప్రకారం ధరఖాస్తును స్వకరిoచేందుకు తిరస్కరించినా...

తప్పుడు...అసంపూర్తి....

తప్పుదోవ పాట్టించే సమాచారము ఇచ్చిన అదికారికి 25,000/-జరిమానా విదించబడుతుంది.

8😃సెక్షన్-2(j)i ప్రకారం ప్రజలందరు ప్రభుత్వరికార్డులు తనిఖీ చేయవచ్చును.

9😃సెక్షన్-7(6)ప్రకారం 30రోజులు దాటకా వచ్చే సమాచారం పూర్తిగా ఉచితం.

10😃సెక్షన్ -8(3)ప్రకారం గడచిన ఎన్ని సంవత్సరాల సమాచారం అయినా కోరవచ్చును.

11😃సెక్షన్-(4)ప్రకారం మన మతృభాషా తెలుగులో సమాచారo ఇవ్వవలసిందే.

12😃సెక్షన్-2(j)(ii)ప్రకారం ప్రతి పేజీని అధికారులు దృవీకరించాలి.

13😃సెక్షన్-18(3)ప్రకారం అదికారులే కమీషన్ ఎదుట స్వయంగా(తప్పని సరిగా)హజరుకావాలి.

14😃సెక్షన్-2(j)(ii)ప్రకారం ప్రతీ పేజీని  అధికారులు దృువీకరిస్తూ సంతకాలతో పాటు(స్టాoప్ )సీల్ వేయాలి.....

కొంతలో కొంత మెరుగైన చట్టం సామాన్యులకు ఆయుధం లాంటి చట్టం ఇది.
ఈ చట్టాన్ని అర్థం చేసుకొని అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటారని ఆశించి ఈ సమాచారం మీ అందరి కోసం షేర్ చేస్తున్నాము.
ప్రతి భారత నాస్తిక సమాజం సభ్యుడు అటు రాజ్యాంగం పై పట్టు కలిగి ఉండాలి. ఇటు సమాచార హక్కు చట్టంపై అవగాహన కలిగి ఉండాలి. చట్టాలపైనా మనకు పట్టు ఉండాలి. 
మంచి పుస్తకాలు చదవడం అలవాటుగా చేసుకుందాం. మన సంఖ్య పెరగాలి. మనకు తెలిసిన నాస్తికులను భానాస కు పరిచయం చేయగలరు. కొత్తగా భానాస వాట్సాప్ గ్రూప్ లో ఆడ్ కావలనుకునె వారి పేరు వివరాలు 7013160831 కు పెట్టండి.


ఇట్లు
భానాస వాట్సాప్ గ్రూప్ కొ ఆర్డినేటర్
మరియు
భైరి నరేష్ రాష్ట్ర అధ్యక్షుడు 7013160831

ఐపిసిలో సెక్షన్ ల అర్థం తెలుసుకోండి*



ఈరోజు మనం కొన్ని సెక్షన్స్ గూర్చి తెలుసుకుందాం. నిత్యం ఈ సెక్షన్‌ లు ఎక్కడో ఒకచోట వింటూ ఉంటాం. 
వాటి ప్రత్యేకత ఏమిటి మనం ఏదైనా సంఘటన జరిగినా, నేరం జరిగిన స్టేషన్ వెళ్ళి ఫిర్యాదు చేయాల్సి వచ్చినా 
ఎవరికైనా సలహా ఇవ్వాల్సి వచ్చినా ఇవి ఉపయోగపడుతాయి.

*ఐపిసిలో సెక్షన్ ల అర్థం తెలుసుకోండి*
======================
  * సెక్షన్ 307 * = హత్యాయత్నం
  * సెక్షన్ 302 * = హత్యకు శిక్ష
  * సెక్షన్ 376 * = అత్యాచారం
  * సెక్షన్ 395 * = దోపిడీ
  * సెక్షన్ 377 * = అసహజ కదలికలు
  * సెక్షన్ 396 * = దోపిడీ
                       సమయంలో హత్య
  * సెక్షన్ 120 * = కుట్ర
  * సెక్షన్ 365 * = కిడ్నాప్
  * సెక్షన్ 201 * = సాక్ష్యాలను తొలగించడం
  * సెక్షన్ 34 * = వస్తువుల ఉద్దేశం
  * సెక్షన్ 412 *= జరుపుకుంటున్నారు
  * సెక్షన్ 378 * = దొంగతనం
  * సెక్షన్ 141 * = అక్రమ డిపాజిట్
  * విభాగం 191 * = తప్పు లక్ష్యం
  * సెక్షన్ 300 *   =   హత్య
  * సెక్షన్ 309 * = ఆత్మహత్య ప్రయత్నం
  * సెక్షన్ 310 * = మోసం
  * సెక్షన్ 312 * = గర్భస్రావం
  * సెక్షన్ 351 * = దాడి చేయడానికి
  * సెక్షన్ 354 * = మహిళలపై సిగ్గు
  * సెక్షన్ 362 * = కిడ్నాప్
  * సెక్షన్ 415 * = ట్రిక్
  * సెక్షన్ 445 * = దేశీయ వివక్ష
  * సెక్షన్ 494 * = జీవిత భాగస్వామి 
               జీవితంలో పునర్వివాహం
  * సెక్షన్ 499 * = పరువు నష్టం
  * సెక్షన్ 511 * = నేరారోపణపై జీవిత ఖైదు.
   
  మన దేశంలో, మనకు తెలియని కొన్ని చట్టాలు ఉన్నాయి.

  *ఐదు ఆసక్తికరమైన విషయాలు*  
ఆ సమాచారం తెలుసుకుందాం,
  ఇది జీవితంలో ఎప్పుడైనా  
  ఉపయోగపడుతుంది.

 *(1) సాయంత్రం 6 గం,,తర్వాత    ఉదయం 6గం,, లోపు  మహిళలను అరెస్టు చేయలేము* -

  క్రిమినల్ కోడ్, సెక్షన్ 46 ప్రకారం, సాయంత్రం 6 గంటల తరువాత మరియు ఉదయం 6 గంటలకు ముందు, భారత పోలీసులు ఎంత తీవ్రమైన నేరం చేసినా, ఏ మహిళను అరెస్టు చేయలేరు.  పోలీసులు అలా చేస్తే, అరెస్టు చేసిన పోలీసు అధికారిపై ఫిర్యాదు చేయవచ్చు.  ఇది ఈ పోలీసు అధికారి ఉద్యోగానికి హాని కలిగించవచ్చు.

  *(2.) సిలిండర్ పేలడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టంపై రూ .4 మిలియన్ల వరకు బీమా పొందవచ్చు*

  పబ్లిక్ లయబిలిటీ పాలసీ ప్రకారం, ఏదైనా కారణం చేత మీ ఇంటిలో సిలిండర్ పేలిపోయి, మీరు ప్రాణ, ఆస్తి నష్టాన్ని ఎదుర్కొంటే, మీరు వెంటనే గ్యాస్ కంపెనీ నుండి బీమా రక్షణ పొందవచ్చు.  గ్యాస్ కంపెనీ నుండి రూ .4 మిలియన్ల వరకు బీమా క్లెయిమ్ చేయవచ్చు.  కంపెనీ మీ దావాను తిరస్కరించినా లేదా వాయిదా వేసినా, దాని గురించి ఫిర్యాదు చేయవచ్చు.  నేరం రుజువైతే, గ్యాస్ కంపెనీ లైసెన్స్ రద్దు చేయవచ్చు.

  *(3) ఏదైనా హోటల్ 5 నక్షత్రాలు అయినా; మీరు ఉచితంగా నీరు త్రాగవచ్చు మరియు వాష్‌రూమ్‌ను ఉపయోగించవచ్చు* -

  ఇండియన్ సిరీస్ యాక్ట్, 1887 ప్రకారం, మీరు దేశంలోని ఏ హోటల్‌కైనా వెళ్లి నీరు అడగవచ్చు మరియు త్రాగవచ్చు మరియు ఆ హోటల్ యొక్క వాష్‌రూమ్‌ను కూడా ఉపయోగించవచ్చు.  హోటల్ చిన్నది లేదా 5 నక్షత్రాలు అయితే, వారు మిమ్మల్ని ఆపలేరు.  హోటల్ యజమాని లేదా ఉద్యోగి మిమ్మల్ని తాగునీరు లేదా వాష్‌రూమ్ ఉపయోగించకుండా ఆపివేస్తే, మీరు చర్య తీసుకోవచ్చు.  మీ ఫిర్యాదు ఈ హోటల్ లైసెన్స్ రద్దు చేయబడవచ్చు.

   *(4) గర్భిణీ స్త్రీలను తొలగించలేరు* -

  ప్రసూతి ప్రయోజన చట్టం 1961 ప్రకారం, గర్భిణీ స్త్రీలను అకస్మాత్తుగా తొలగించలేరు.  గర్భధారణ సమయంలో, యజమాని మూడు నెలల నోటీసు మరియు ఖర్చులలో కొంత భాగాన్ని చెల్లించాలి.  అతను అలా చేయకపోతే, ప్రభుత్వ ఉపాధి సంస్థకు ఫిర్యాదు చేయవచ్చు.  ఈ ఫిర్యాదు సంస్థను మూసివేయడానికి కారణం కావచ్చు లేదా కంపెనీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

  *(5) మీ ఫిర్యాదు రాయడానికి పోలీసు అధికారి నిరాకరించలేరు*

  ఐపిసి సెక్షన్ 166 ఎ ప్రకారం, మీ ఫిర్యాదులను నమోదు చేయడానికి ఏ పోలీసు అధికారి నిరాకరించలేరు.  అతను అలా చేస్తే, అతనిపై సీనియర్ పోలీసు కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చు.  నేరం రుజువైతే, పోలీసు అధికారికి కనీసం * (6) * నెలల నుండి 1 సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా తొలగింపును ఎదుర్కోవచ్చు.

  ఇవి ఆసక్తికరమైన వాస్తవాలు, ఇవి మన దేశ చట్టం ప్రకారం వస్తాయి, కాని వాటి గురించి మనకు తెలియదు.  మీ జీవితంలో ఉపయోగపడే ఆసక్తికరమైన విషయాలను మీకు అందించడానికి  నేను నా వంతు ప్రయత్నం చేస్తాను.

  *ఈ సందేశాన్ని మీ వద్ద ఉంచుకోండి, ఈ హక్కులు ఎప్పుడైనా చెల్లుతాయి*.
=================

సేకరణ :భానాస టీం.

చిన్న విన్నపం మన భానాస వాట్సాప్ కూడలిలో చేరాలనుకునె వారి పేరు వివరాలు 7013160831కి తెలుపగలరు.

ఇట్లు
భానాస వాట్సాప్ గ్రూప్ కో ఆర్డినేటర్

Wednesday, June 9, 2021

"నందమూరి బాలకృష్ణ" గారికి మా "Vtv తెలుగు" చానల్ తరఫున "జన్మదిన శుభాకాంక్షలు"

"నందమూరి బాలకృష్ణ" గారికి మా "Vtv తెలుగు" చానల్ తరఫున "జన్మదిన శుభాకాంక్షలు"

Tuesday, June 8, 2021

పగటివేళ లాక్‌డౌన్‌ ఎత్తివేత

*పగటివేళ లాక్‌డౌన్‌ ఎత్తివేత*

*ఉదయం 6 నుంచి సాయంత్రం 5 వరకు సడలింపు*

*సాయంత్రం 6 - ఉదయం 6 మధ్య కఠిన ఆంక్షలు..*

*రేపటినుంచి అమలు*

*కరోనా తగ్గని ఏడు నియోజకవర్గాల్లో పాత నిబంధనలే*

తెలంగాణలో పగటిపూట లాక్‌డౌన్‌ను ప్రభుత్వం ఎత్తివేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన మంగళవారం ప్రగతిభవన్‌లో జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసులు తగ్గిన ప్రాంతాలన్నింటిలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లాక్‌డౌన్‌ను సర్కారు సడలించింది. 5 గంటలకు అన్ని దుకాణాలు, వాణిజ్య సముదాయాలు మూసివేయాలి. తర్వాత గంటసేపు అంటే 6 గంటల వరకు ఎవరి గమ్యస్థానాలకు వారు చేరుకునేందుకు వెసులుబాటు కల్పించింది. సాయంత్రం ఆరు గంటల నుంచి మర్నాడు ఉదయం ఆరు గంటల వరకు లాక్‌డౌన్‌ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని పోలీసుశాఖను ఆదేశించింది. ఈ నెల 10 నుంచి 19వ తేదీ వరకు ఇది అమల్లో ఉంటుంది. కరోనా పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చే వరకు రాత్రిపూట ఆంక్షలు అమలు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. కేసుల సంఖ్య తగ్గితే దశలవారీగా నెలాఖరు నాటికి పూర్తిగా లాక్‌డౌన్‌ ఎత్తివేస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చినట్లు తెలిసింది. కరోనా పూర్తిగా అదుపులోకి రాని.. సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జునసాగర్‌, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ నియోజకవర్గాల పరిధిలో మాత్రం ప్రస్తుత లాక్‌డౌన్‌ నిబంధనలే కొనసాగుతాయి. ఈ ఏడు నియోజకవర్గాల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సడలింపు... గమ్యస్థానాలకు చేరుకునేందుకు మరో గంట అంటే మధ్యాహ్నం రెండు గంటల వరకు వెసులుబాటు కొనసాగించాలని తీర్మానించింది. సీఎం ఆదేశాలతో ఈ ప్రాంతాల్లో పర్యటించిన రాష్ట్ర వైద్యాధికారుల బృందం సిఫార్సుల మేరకు యథాతథంగా ఆంక్షలు కొనసాగించాలని మంత్రిమండలి నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గిందని వైద్యఆరోగ్యశాఖ నివేదిక ఇవ్వగా... ఆంక్షలతో ఆదాయానికి గండి పడిందని స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రవాణా, ఆబ్కారీ, రెవెన్యూ శాఖలు నివేదించాయి. వీటిని పరిశీలించిన ప్రభుత్వం, పగటిపూట వ్యాపార కార్యకలాపాలకు మరికొంత సమయం పెంచింది.

*పూర్తిస్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలు*

లాక్‌డౌన్‌ సడలింపుల దృష్ట్యా ఈ నెల 10 నుంచి 19వ తేదీ వరకు తెలంగాణలోని రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిస్థాయిలో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు అనుమతి లేదని పేర్కొంది. మంత్రిమండలి నిర్ణయాల మేరకు తెలంగాణలో లాక్‌డౌన్‌ పొడిగింపుపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఆర్టీసీ, సెట్విన్‌, ఆటోలు, క్యాబ్‌లు సహా అన్ని రకాల ప్రజారవాణాకు అనుమతిచ్చిన ప్రభుత్వం.. అంతర్రాష్ట్ర సర్వీసులను రద్దు చేసింది. వైద్యఆరోగ్యం సహా అత్యవసర సేవలను లాక్‌డౌన్‌ నుంచి మినహాయించింది. సినిమా హాళ్లు, వినోదపార్కులు, బార్లు, పబ్బులు, క్లబ్బులు, జిమ్‌లు, ఈతకొలనుల కార్యకలాపాలను నిషేధించింది. పెళ్లిళ్లకు 40 మంది, అంత్యక్రియలకు 20 మందే హాజరు కావాలని సూచించింది. జాతీయ రహదారులపైనున్న పెట్రోలు బంకులు 24 గంటలూ పనిచేస్తాయి. మిగిలిన బంకులు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నడుస్తాయని పేర్కొంది.

_*🗞️🇮🇳సత్యమేవ జయతే 🇮🇳🗞️*_

కాన్పూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం

లక్నో: యూపీలోని కాన్పూర్ నగర్‌లోని సచెండి ప్రాంతంలో మంగళవారం రాత్రి ఎదురుగా వస్తున్న టెంపో డబుల్ డెక్కర్ బస్సును  డికొనడంతో 17 మంది మరణించారు. ఒక డజను మంది కూడా గాయపడ్డారు
పోలీసులు స్థానికుల సహాయంతో సహాయక చర్యలను ప్రారంభించి, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.మంగళవారం రాత్రి 8 గంటలకు మా పితాంబర ట్రావెల్స్‌కు చెందిన డబుల్ డెక్కర్ బస్సు ఫజల్‌గంజ్ నుంచి అహ్మదాబాద్‌కు బయలుదేరిందని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ కాన్పూర్ రేంజ్ మోహిత్ అగర్వాల్ తెలిపారు.
బస్సు డ్రైవర్ సచేండిలోని భారత్ గ్యాస్ ఏజెన్సీ, అకస్మాత్తుగా ఐదుగురు ప్రయాణికులతో వెళుతున్న ఒక టెంపో ముందు వచ్చింది. బస్సు డ్రైవర్ బ్రేక్‌లు వేసినా టెంపోతో  డికొనడం  ఆపలేకపోయాడు. క్రాష్ యొక్క ప్రభావం ఏమిటంటే, బస్సు విసిరివేయబడి, ఒక గుంటలో జాగ్రత్త పడింది, "అగర్వాల్ చెప్పారు.

మరొక వైపు రోడ్డు పక్కన పడి లోపలికి పడిపోయింది

మృతుల బంధువులకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర సంతాపం తెలిపారు.

వెంటనే అక్కడికి చేరుకుని, సాధ్యమైనంత సహాయం అందించాలని సీనియర్ అధికారులకు సూచనలు ఇవ్వబడ్డాయి.

Monday, June 7, 2021

సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించిమోదీ ప్రసంగం


 ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం సాయంత్రం జాతినుద్దేశించి

ప్రసంగించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రధాని మంత్రి కార్యాలయం(పీఎంవో) ట్విట్టర్ ద్వారా ఉన్నట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో దశల వారీగా అన్లాక్ ప్రక్రియ గురించి కూడా ప్రధాని మాట్లాడే అవకాశం ఉంది.

మోదీ జాతినుద్దేశించి మాట్లాడతారంటూ ప్రధాన

ప్రకటించింది. దేశంలో కొవిడ్ పరిస్థితులు,

వ్యాక్సినేషన్పై ప్రధాని మోదీ ప్రకటన చేసే అవకాశం

Sunday, June 6, 2021

*పాఠశాల విద్య పనితీరు సూచికల విడుదల*



ఈనాడు, దిల్లీ: కేంద్ర విద్యాశాఖ తాజాగా పాఠశాల విద్య పనితీరు సూచిక 2019-20(పెర్ఫార్మెన్స్‌ గ్రేడింగ్‌ ఇండెక్స్‌)ను విడుదల చేసింది. ఇందులో ఏపీ లెవెల్‌ 4, తెలంగాణ లెవెల్‌ 5లో నిలిచాయి. కేంద్ర విద్యాశాఖ.. పాఠశాల విద్యానాణ్యతలో రాష్ట్రాలు కనబరుస్తున్న పనితీరును పది లెవెల్స్‌గా విభజించి వాటికి తొమ్మిది గ్రేడ్‌లను ప్రకటించింది. ఇందులో లెవెల్‌ 1లో ఒక్క రాష్ట్రమూ స్థానాన్ని దక్కించుకోలేదు. లెవెల్‌ 2లో గ్రేడ్‌ 1++ జాబితాలో 901-950 మార్కులతో అండమాన్‌ నికోబార్‌, చండీగఢ్‌, కేరళ, పంజాబ్‌, తమిళనాడు రాష్ట్రాలు ప్రథమస్థానంలో నిలిచాయి. లెవెల్‌-4లో 801-850 మార్కులతో గ్రేడ్‌-1 విభాగంలో ఆంధ్రప్రదేశ్‌, లెవెల్‌ 5లో 751-800 మార్కులతో గ్రేడ్‌-2లో తెలంగాణ నిలిచింది. పాఠశాల విద్యలో చేపట్టిన మార్పులను పరిగణనలోకి తీసుకుని 70 కొలమానాల ఆధారంగా రాష్ట్రాల పనితీరును అంచనా వేశారు. విద్యావ్యవస్థలోని లోపాలను సరిదిద్ది పాఠశాల విద్యను బలోపేతం చేయడానికి ఈ గ్రేడ్లు ఉపయోగపడతాయని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది.

_*🗞️🇮🇳సత్యమేవ జయతే 🇮🇳🗞️*_

ఆల్ టైం రికార్డ్‌కు చేరిన పెట్రోల్ ధర

*ముంబై;ఈరోజు వార్తలు-*: కొంత కాలంగా అదే పనిగా పరుగులెత్తుతున్న పెట్రోల్ ధరలు తాజాగా పెరిగిన ధరలతో ఆల్ టైం రికార్డుకు చేరుకున్నాయి.రాజస్తాన్‌లోని శ్రీగంగాధర జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర 106.08 రూపాయలుగా నమోదైంది. దేశంలో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పెట్రోల్ ధర 100 రూపాయలు దాటి చాలా కాలమైంది. దేశంలో పెట్రోల్ ధర మొదటిసారి 100 రూపాయల మార్క్‌ను దాటింది కూడా రాజస్తాన్‌లోనే. అయితే శ్రీగంగాధర జిల్లాలో నమోదైన పెట్రోల్ ధర కంటే అవి తక్కువే. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఐదు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు 100కు పైగానే కొనసాగుతున్నాయి. కాగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 101.3గా నమోదైంది. ఇక డీజిల్ ధర 93.35గా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 95.09గా నమోదు కాగా, డీజిల్ ధర 86.01గా నమోదైంది.

https://youtu.be/rP569otzjS0?si=3Ff66nfPs8XZcLsD

https://youtu.be/rP569otzjS0?si=3Ff66nfPs8XZcLsD