*ముంబై;ఈరోజు వార్తలు-*: కొంత కాలంగా అదే పనిగా పరుగులెత్తుతున్న పెట్రోల్ ధరలు తాజాగా పెరిగిన ధరలతో ఆల్ టైం రికార్డుకు చేరుకున్నాయి.రాజస్తాన్‌లోని శ్రీగంగాధర జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర 106.08 రూపాయలుగా నమోదైంది. దేశంలో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పెట్రోల్ ధర 100 రూపాయలు దాటి చాలా కాలమైంది. దేశంలో పెట్రోల్ ధర మొదటిసారి 100 రూపాయల మార్క్‌ను దాటింది కూడా రాజస్తాన్‌లోనే. అయితే శ్రీగంగాధర జిల్లాలో నమోదైన పెట్రోల్ ధర కంటే అవి తక్కువే. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఐదు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు 100కు పైగానే కొనసాగుతున్నాయి. కాగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 101.3గా నమోదైంది. ఇక డీజిల్ ధర 93.35గా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 95.09గా నమోదు కాగా, డీజిల్ ధర 86.01గా నమోదైంది.
Subscribe to:
Post Comments (Atom)
https://youtu.be/rP569otzjS0?si=3Ff66nfPs8XZcLsD
https://youtu.be/rP569otzjS0?si=3Ff66nfPs8XZcLsD
-
'మిషన్ ఇంపాజిబుల్ 7' చిత్రంతో ప్రభాస్ హాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నాడని ఓ వార్త సోషల్‌మీడియాను షేక్ చేసింది. అది తన వరకు రావ...
-
గురువారం. *ఒంగోలులో ఆనందయ్య కరోనాకు మందును ఏడువేల మందికి పంపిణీ చేసిన* *ఒంగోలు పార్లమెంట్ సభ్యులు* *శ్రీ మాగుంట శ్రీ...
-
లక్నో: యూపీలోని కాన్పూర్ నగర్‌లోని సచెండి ప్రాంతంలో మంగళవారం రాత్రి ఎదురుగా వస్తున్న టెంపో డబుల్ డెక్కర్ బస్సును డికొనడంతో 17 మ...
No comments:
Post a Comment