ఈనాడు, దిల్లీ: కేంద్ర విద్యాశాఖ తాజాగా పాఠశాల విద్య పనితీరు సూచిక 2019-20(పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్)ను విడుదల చేసింది. ఇందులో ఏపీ లెవెల్ 4, తెలంగాణ లెవెల్ 5లో నిలిచాయి. కేంద్ర విద్యాశాఖ.. పాఠశాల విద్యానాణ్యతలో రాష్ట్రాలు కనబరుస్తున్న పనితీరును పది లెవెల్స్‌గా విభజించి వాటికి తొమ్మిది గ్రేడ్‌లను ప్రకటించింది. ఇందులో లెవెల్ 1లో ఒక్క రాష్ట్రమూ స్థానాన్ని దక్కించుకోలేదు. లెవెల్ 2లో గ్రేడ్ 1++ జాబితాలో 901-950 మార్కులతో అండమాన్ నికోబార్, చండీగఢ్, కేరళ, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాలు ప్రథమస్థానంలో నిలిచాయి. లెవెల్-4లో 801-850 మార్కులతో గ్రేడ్-1 విభాగంలో ఆంధ్రప్రదేశ్, లెవెల్ 5లో 751-800 మార్కులతో గ్రేడ్-2లో తెలంగాణ నిలిచింది. పాఠశాల విద్యలో చేపట్టిన మార్పులను పరిగణనలోకి తీసుకుని 70 కొలమానాల ఆధారంగా రాష్ట్రాల పనితీరును అంచనా వేశారు. విద్యావ్యవస్థలోని లోపాలను సరిదిద్ది పాఠశాల విద్యను బలోపేతం చేయడానికి ఈ గ్రేడ్లు ఉపయోగపడతాయని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది.
_*🗞️🇮🇳సత్యమేవ జయతే 🇮🇳🗞️*_
No comments:
Post a Comment