Tuesday, June 8, 2021

పగటివేళ లాక్‌డౌన్‌ ఎత్తివేత

*పగటివేళ లాక్‌డౌన్‌ ఎత్తివేత*

*ఉదయం 6 నుంచి సాయంత్రం 5 వరకు సడలింపు*

*సాయంత్రం 6 - ఉదయం 6 మధ్య కఠిన ఆంక్షలు..*

*రేపటినుంచి అమలు*

*కరోనా తగ్గని ఏడు నియోజకవర్గాల్లో పాత నిబంధనలే*

తెలంగాణలో పగటిపూట లాక్‌డౌన్‌ను ప్రభుత్వం ఎత్తివేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన మంగళవారం ప్రగతిభవన్‌లో జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసులు తగ్గిన ప్రాంతాలన్నింటిలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లాక్‌డౌన్‌ను సర్కారు సడలించింది. 5 గంటలకు అన్ని దుకాణాలు, వాణిజ్య సముదాయాలు మూసివేయాలి. తర్వాత గంటసేపు అంటే 6 గంటల వరకు ఎవరి గమ్యస్థానాలకు వారు చేరుకునేందుకు వెసులుబాటు కల్పించింది. సాయంత్రం ఆరు గంటల నుంచి మర్నాడు ఉదయం ఆరు గంటల వరకు లాక్‌డౌన్‌ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని పోలీసుశాఖను ఆదేశించింది. ఈ నెల 10 నుంచి 19వ తేదీ వరకు ఇది అమల్లో ఉంటుంది. కరోనా పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చే వరకు రాత్రిపూట ఆంక్షలు అమలు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. కేసుల సంఖ్య తగ్గితే దశలవారీగా నెలాఖరు నాటికి పూర్తిగా లాక్‌డౌన్‌ ఎత్తివేస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చినట్లు తెలిసింది. కరోనా పూర్తిగా అదుపులోకి రాని.. సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జునసాగర్‌, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ నియోజకవర్గాల పరిధిలో మాత్రం ప్రస్తుత లాక్‌డౌన్‌ నిబంధనలే కొనసాగుతాయి. ఈ ఏడు నియోజకవర్గాల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సడలింపు... గమ్యస్థానాలకు చేరుకునేందుకు మరో గంట అంటే మధ్యాహ్నం రెండు గంటల వరకు వెసులుబాటు కొనసాగించాలని తీర్మానించింది. సీఎం ఆదేశాలతో ఈ ప్రాంతాల్లో పర్యటించిన రాష్ట్ర వైద్యాధికారుల బృందం సిఫార్సుల మేరకు యథాతథంగా ఆంక్షలు కొనసాగించాలని మంత్రిమండలి నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గిందని వైద్యఆరోగ్యశాఖ నివేదిక ఇవ్వగా... ఆంక్షలతో ఆదాయానికి గండి పడిందని స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రవాణా, ఆబ్కారీ, రెవెన్యూ శాఖలు నివేదించాయి. వీటిని పరిశీలించిన ప్రభుత్వం, పగటిపూట వ్యాపార కార్యకలాపాలకు మరికొంత సమయం పెంచింది.

*పూర్తిస్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలు*

లాక్‌డౌన్‌ సడలింపుల దృష్ట్యా ఈ నెల 10 నుంచి 19వ తేదీ వరకు తెలంగాణలోని రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిస్థాయిలో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు అనుమతి లేదని పేర్కొంది. మంత్రిమండలి నిర్ణయాల మేరకు తెలంగాణలో లాక్‌డౌన్‌ పొడిగింపుపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఆర్టీసీ, సెట్విన్‌, ఆటోలు, క్యాబ్‌లు సహా అన్ని రకాల ప్రజారవాణాకు అనుమతిచ్చిన ప్రభుత్వం.. అంతర్రాష్ట్ర సర్వీసులను రద్దు చేసింది. వైద్యఆరోగ్యం సహా అత్యవసర సేవలను లాక్‌డౌన్‌ నుంచి మినహాయించింది. సినిమా హాళ్లు, వినోదపార్కులు, బార్లు, పబ్బులు, క్లబ్బులు, జిమ్‌లు, ఈతకొలనుల కార్యకలాపాలను నిషేధించింది. పెళ్లిళ్లకు 40 మంది, అంత్యక్రియలకు 20 మందే హాజరు కావాలని సూచించింది. జాతీయ రహదారులపైనున్న పెట్రోలు బంకులు 24 గంటలూ పనిచేస్తాయి. మిగిలిన బంకులు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నడుస్తాయని పేర్కొంది.

_*🗞️🇮🇳సత్యమేవ జయతే 🇮🇳🗞️*_

కాన్పూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం

లక్నో: యూపీలోని కాన్పూర్ నగర్‌లోని సచెండి ప్రాంతంలో మంగళవారం రాత్రి ఎదురుగా వస్తున్న టెంపో డబుల్ డెక్కర్ బస్సును  డికొనడంతో 17 మంది మరణించారు. ఒక డజను మంది కూడా గాయపడ్డారు
పోలీసులు స్థానికుల సహాయంతో సహాయక చర్యలను ప్రారంభించి, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.మంగళవారం రాత్రి 8 గంటలకు మా పితాంబర ట్రావెల్స్‌కు చెందిన డబుల్ డెక్కర్ బస్సు ఫజల్‌గంజ్ నుంచి అహ్మదాబాద్‌కు బయలుదేరిందని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ కాన్పూర్ రేంజ్ మోహిత్ అగర్వాల్ తెలిపారు.
బస్సు డ్రైవర్ సచేండిలోని భారత్ గ్యాస్ ఏజెన్సీ, అకస్మాత్తుగా ఐదుగురు ప్రయాణికులతో వెళుతున్న ఒక టెంపో ముందు వచ్చింది. బస్సు డ్రైవర్ బ్రేక్‌లు వేసినా టెంపోతో  డికొనడం  ఆపలేకపోయాడు. క్రాష్ యొక్క ప్రభావం ఏమిటంటే, బస్సు విసిరివేయబడి, ఒక గుంటలో జాగ్రత్త పడింది, "అగర్వాల్ చెప్పారు.

మరొక వైపు రోడ్డు పక్కన పడి లోపలికి పడిపోయింది

మృతుల బంధువులకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర సంతాపం తెలిపారు.

వెంటనే అక్కడికి చేరుకుని, సాధ్యమైనంత సహాయం అందించాలని సీనియర్ అధికారులకు సూచనలు ఇవ్వబడ్డాయి.

Monday, June 7, 2021

సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించిమోదీ ప్రసంగం


 ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం సాయంత్రం జాతినుద్దేశించి

ప్రసంగించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రధాని మంత్రి కార్యాలయం(పీఎంవో) ట్విట్టర్ ద్వారా ఉన్నట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో దశల వారీగా అన్లాక్ ప్రక్రియ గురించి కూడా ప్రధాని మాట్లాడే అవకాశం ఉంది.

మోదీ జాతినుద్దేశించి మాట్లాడతారంటూ ప్రధాన

ప్రకటించింది. దేశంలో కొవిడ్ పరిస్థితులు,

వ్యాక్సినేషన్పై ప్రధాని మోదీ ప్రకటన చేసే అవకాశం

Sunday, June 6, 2021

*పాఠశాల విద్య పనితీరు సూచికల విడుదల*



ఈనాడు, దిల్లీ: కేంద్ర విద్యాశాఖ తాజాగా పాఠశాల విద్య పనితీరు సూచిక 2019-20(పెర్ఫార్మెన్స్‌ గ్రేడింగ్‌ ఇండెక్స్‌)ను విడుదల చేసింది. ఇందులో ఏపీ లెవెల్‌ 4, తెలంగాణ లెవెల్‌ 5లో నిలిచాయి. కేంద్ర విద్యాశాఖ.. పాఠశాల విద్యానాణ్యతలో రాష్ట్రాలు కనబరుస్తున్న పనితీరును పది లెవెల్స్‌గా విభజించి వాటికి తొమ్మిది గ్రేడ్‌లను ప్రకటించింది. ఇందులో లెవెల్‌ 1లో ఒక్క రాష్ట్రమూ స్థానాన్ని దక్కించుకోలేదు. లెవెల్‌ 2లో గ్రేడ్‌ 1++ జాబితాలో 901-950 మార్కులతో అండమాన్‌ నికోబార్‌, చండీగఢ్‌, కేరళ, పంజాబ్‌, తమిళనాడు రాష్ట్రాలు ప్రథమస్థానంలో నిలిచాయి. లెవెల్‌-4లో 801-850 మార్కులతో గ్రేడ్‌-1 విభాగంలో ఆంధ్రప్రదేశ్‌, లెవెల్‌ 5లో 751-800 మార్కులతో గ్రేడ్‌-2లో తెలంగాణ నిలిచింది. పాఠశాల విద్యలో చేపట్టిన మార్పులను పరిగణనలోకి తీసుకుని 70 కొలమానాల ఆధారంగా రాష్ట్రాల పనితీరును అంచనా వేశారు. విద్యావ్యవస్థలోని లోపాలను సరిదిద్ది పాఠశాల విద్యను బలోపేతం చేయడానికి ఈ గ్రేడ్లు ఉపయోగపడతాయని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది.

_*🗞️🇮🇳సత్యమేవ జయతే 🇮🇳🗞️*_

ఆల్ టైం రికార్డ్‌కు చేరిన పెట్రోల్ ధర

*ముంబై;ఈరోజు వార్తలు-*: కొంత కాలంగా అదే పనిగా పరుగులెత్తుతున్న పెట్రోల్ ధరలు తాజాగా పెరిగిన ధరలతో ఆల్ టైం రికార్డుకు చేరుకున్నాయి.రాజస్తాన్‌లోని శ్రీగంగాధర జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర 106.08 రూపాయలుగా నమోదైంది. దేశంలో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పెట్రోల్ ధర 100 రూపాయలు దాటి చాలా కాలమైంది. దేశంలో పెట్రోల్ ధర మొదటిసారి 100 రూపాయల మార్క్‌ను దాటింది కూడా రాజస్తాన్‌లోనే. అయితే శ్రీగంగాధర జిల్లాలో నమోదైన పెట్రోల్ ధర కంటే అవి తక్కువే. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఐదు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు 100కు పైగానే కొనసాగుతున్నాయి. కాగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 101.3గా నమోదైంది. ఇక డీజిల్ ధర 93.35గా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 95.09గా నమోదు కాగా, డీజిల్ ధర 86.01గా నమోదైంది.

https://youtu.be/rP569otzjS0?si=3Ff66nfPs8XZcLsD

https://youtu.be/rP569otzjS0?si=3Ff66nfPs8XZcLsD