డెహ్రాడూన్ : కరోనాను నియంత్రించడంలో అల్లోపతి వైద్యం విఫలమైందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యోగా గురువు రాందేవ్ బాబాకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ( IMA) ఉత్తరాఖండ్ శాఖ రూ. 1000 కోట్ల పరువు నష్టం దావా వేసింది. కరోనా కట్టడి విషయంలో అల్లోపతి వైద్యంపై తాను చేసిన ప్రకటనలపై క్షమాపణ కోరుతూ వీడియోను పోస్టు చేయకపోయినా, రాబోయే 15 రోజుల్లో రాతపూర్వకంగా క్షమాపణ చెప్పకపోయినా, రాందేవ్ బాబా రూ. 1000 కోట్ల పరువు నష్టం చెల్లించాలని ఐఎంఏ ఉత్తరాఖండ్ శాఖ తమ పరువు నష్టం దావా నోటీసులో పేర్కొన్నది. రాందేవ్ బాబాపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీర్థసింగ్ రావత్కు కూడా ఐఎంఏ ఉత్తరాఖండ్ శాఖ లేఖ రాసింది.
No comments:
Post a Comment