Thursday, June 10, 2021

మంచి ఆయుధం గూర్చి తెలుసుకుందాం

 మంచి ఆయుధం గూర్చి తెలుసుకుందాం.

సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం సామాన్య ప్రజలు గవర్నమెంట్ ఆఫీస్ డైరెక్టుగా వెళ్లి రికార్డ్స్ తనిఖీ చేయొచ్చు మీకు తెలుసా? రోడ్స్,వాటర్, కరెంట్, రేషన్ ఇలాంటి వాటిలో అవినీతి జరిగింది అని మనకు అనిపిస్తే మనం తనిఖీ చేయొచ్చు. దేనికి ఎంత ఖర్చు అయింది రూపాయి రూపాయికి బిల్ చూపియమని అనే అధికారం మనకు ఉంది లెటర్ రూపం లో కూడా అడగచ్చు మొత్తం వివరాలు నాకు పోస్ట్ రూపంలో కావాలి ఒక వేళ సీడి రూపంలో ఇవ్వండి ఆ ఖర్చు నేను బరిస్తా అని తెల్పచ్చు సమాచారం పెద్దగా ఉంటే. అని మన లెటర్ రూపం లో దరఖాస్తు పెట్టొచ్చు సాంపిల్  ఫార్మాట్ కూడా కింద ఉంది. అది  ధెనీ కోసం, నీకెందుకు, ఇవ్వం, అనే అధికారం వాళ్లకు లేదు ఒక వేళ తప్పుడు సమాచారం ఇచ్చిన ఇవ్వము అన్న వాళ్లకు చట్ట ప్రకారం శిక్షలు ఉంటాయి

✒#సమాచారం కోసం #దరఖాస్తు💎
*సమాచార హక్కు చట్టం -2005*
*🕸🕸🕸🕸🕸🕸🕸🕸🕸🕸*
*TO*
*ప్రజా సమాచార అధికారి*
*కార్యాలయం పేరు*
*చిరునామా*
*జిల్లా*

*
#సమాచార #హక్కు #చట్టం #సెక్షన్ 6 (1)ప్రకారం కింది సమాచారాన్ని సెక్షన్ 7 (1) ప్రకారం వీలైనంత త్వరగా లేదా 30 రోజుల్లో సెక్షన్ 2 (జె)(ii)ప్రకారం సర్టిపైడ్ కాఫీలు పంపగలరు*
*REF:1 MS.NO.114 జనరల్ అడ్మినిస్ట్రేషన్ (SER-C)DEPT.DATED.16:03:2009*
*🔜🔄 అయ్యా! నేను కోరుతున్న సమాచారం న్యాయ సంబంధం ప్రజా ప్రయోజనాల నిమిత్తం విన్నపముగా కోరుతున్నాను*

*🔜🔄   తమ కార్యాలయంలో నిర్వహించ వలసిన రిజిస్టర్లు వివరాలు తెలుపగలరు*

*🔜🔄  తమ కార్యాలయంలో సమాచార హక్కు చట్ట పరిధిలో సెక్షన్ 4 (1)(బి)ప్రకారం కార్యాలయ 17 అంశాల ప్రచురణలు తెలుగులో(లేక) లిఖిత పూర్వకంగా సమాచార ఇవ్వగలరు*

*🔜🔄ప్రొద్దుటూరు మండలం.కొత్తపల్లె గ్రామానికి  జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం క్రింద కేటాయించిన బడ్జెట్ నిధుల వివరాలు తెలుపగలరు*

*🔜🔄 కొత్తపల్లె గ్రామంలో ఏ ప్రాతి పధికనపై పనులు కేటాయించారు వాటి వివరాలు తెలుపగలరు*

*🔜🔄 A) గ్రామ పంచాయితీ స్థాయిలో చేపట్టిన పనుల వివరాలు.B) గ్రామానికి కేటాయించిన నిధులు చేసిన నిధుల ఖర్చులు, C) ఈ పథకం కింద గ్రామంలో నిరుద్యోగ భృతి  పొందిన  లబ్ది పొందిన లబ్ది దారులు వివరాలు,D) సెక్షన్ 6 ప్రకారం పేర్కన్న ప్రకారం కూలీ రేటు వివరాలు,E)పని ప్రదేశం లో  కూలీలకు ప్రమాదం కల్గినప్పుడు కూలీలకు అందిస్తున్న మెడిసిన్  మందుల వివరాలు,తెలుపగలరు*

*🔜🔄 A) గ్రామ సభ సామాజిక  తనిఖీలో నిర్వహించిన మస్టర్లు జాబితాలు,B) బిల్లులు.వివరాలు,C)ఓచర్లు,వివరాలు,C) కొలతలు పుస్తకాలు వివరాలు,D)ఆమోద ప్రతులు,ఇతర  సంబంధిత పుస్తకాల జమా ఖర్చులెక్కల కాగితాల వివరాలు ఇవ్వగలరు*

🔜🔄 *నా అనుమతి లేకుండా నాపేరు చిరునామా ఇతరులకు తెలుపరాదని సంబంధిత కార్యాలయ అధికారిగార్కి నా విన్నపం*

*🔜🔄 దరఖాస్తు రుసుం.......నగదు/డిమాండ్ బ్యాంకర్స్ యొక్క చెక్క్/ఇండియన్ పోస్టల్ ఆర్డర్/కోర్టు స్టాంప్ ఫీ (వివరాలు)..........సమాచార హక్కు చట్టం నిబంధనల ప్రకారం చెల్లిస్తున్నాను రశీదు ఇవ్వగలరు కృతజ్ఞతలు.*

*🔜🔄 పైన పేర్కొన్న రెఫరెన్స్1ప్రకారం ఈ దరఖాస్తుకు పూర్తి ఖచ్చితమైన సమాచారం ఇవ్వడంలో విఫలమైనప్పుడు సమాచారం/దరఖాస్తు తిరస్కరింన/అసంపూర్తి సమాచారం/తప్పుదారి పట్టించే సమాచారం/సమాచార నిరాకరణకు పాల్పడిన ప్రజా సమాచార అదికారిపై సివిల్ సర్విసెస్(కండక్ట్)రూల్స్ 1984 ప్రకారం ఎ) శాఖపరమైన చర్యలు తీసుకోవలసిన బాధ్యత కల్గిన అదికారి పేరు.బి)హోదా సి)కార్యాలయ చిరునామాలు.డి)మొబైల్ నంబర్లు.ఇ)ఈమెయిల్ ఐడిలు పంపగలరు.*

సమాచార హక్కు గురించి మీకు పూర్తి అవగాహనా లేకపోతే క్రింది వివరాలు #చూడoడి..#తెలుసుకోండి..#తెలియజేయండి

1😃సెక్షన్-6(1)

సమాచార హక్కు.

2😃సెక్షన్-4(1)Bప్రకారం నెలవారి జీతాలు అదికారులు ప్రజలకు తెలపవలసినదే.

3😃సెక్షన్ -6(3)వారిని కానీ సమాచారం మరో కార్యాలయానికి పంపవలసిన బాద్యత అధికారులదే.

4😃సెక్షన్-7(1)ప్రకారం 30రోజుల లోపు సమాచారము ఇవ్వవలసిందే... వ్యక్తి జీవితానికీ, స్వేచ్ఛకు సoభందించినది ఐతే 48 గంటల లోపే ఇవ్వాలి.

5😃సెక్షన్-19(8) ప్రకారం ధరాఖస్తుదారునకి నష్టపరిహారం వస్తుoది.

6😃సెక్షన్-6(2)ప్రకారం సమాచారము అడిగే హక్కు మనది. "అది మీకెoదుకు" అనే హక్కు అదికారులకు లేదు.

7😃సెక్షన్-21(1)ప్రకారం ధరఖాస్తును స్వకరిoచేందుకు తిరస్కరించినా...

తప్పుడు...అసంపూర్తి....

తప్పుదోవ పాట్టించే సమాచారము ఇచ్చిన అదికారికి 25,000/-జరిమానా విదించబడుతుంది.

8😃సెక్షన్-2(j)i ప్రకారం ప్రజలందరు ప్రభుత్వరికార్డులు తనిఖీ చేయవచ్చును.

9😃సెక్షన్-7(6)ప్రకారం 30రోజులు దాటకా వచ్చే సమాచారం పూర్తిగా ఉచితం.

10😃సెక్షన్ -8(3)ప్రకారం గడచిన ఎన్ని సంవత్సరాల సమాచారం అయినా కోరవచ్చును.

11😃సెక్షన్-(4)ప్రకారం మన మతృభాషా తెలుగులో సమాచారo ఇవ్వవలసిందే.

12😃సెక్షన్-2(j)(ii)ప్రకారం ప్రతి పేజీని అధికారులు దృవీకరించాలి.

13😃సెక్షన్-18(3)ప్రకారం అదికారులే కమీషన్ ఎదుట స్వయంగా(తప్పని సరిగా)హజరుకావాలి.

14😃సెక్షన్-2(j)(ii)ప్రకారం ప్రతీ పేజీని  అధికారులు దృువీకరిస్తూ సంతకాలతో పాటు(స్టాoప్ )సీల్ వేయాలి.....

కొంతలో కొంత మెరుగైన చట్టం సామాన్యులకు ఆయుధం లాంటి చట్టం ఇది.
ఈ చట్టాన్ని అర్థం చేసుకొని అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటారని ఆశించి ఈ సమాచారం మీ అందరి కోసం షేర్ చేస్తున్నాము.
ప్రతి భారత నాస్తిక సమాజం సభ్యుడు అటు రాజ్యాంగం పై పట్టు కలిగి ఉండాలి. ఇటు సమాచార హక్కు చట్టంపై అవగాహన కలిగి ఉండాలి. చట్టాలపైనా మనకు పట్టు ఉండాలి. 
మంచి పుస్తకాలు చదవడం అలవాటుగా చేసుకుందాం. మన సంఖ్య పెరగాలి. మనకు తెలిసిన నాస్తికులను భానాస కు పరిచయం చేయగలరు. కొత్తగా భానాస వాట్సాప్ గ్రూప్ లో ఆడ్ కావలనుకునె వారి పేరు వివరాలు 7013160831 కు పెట్టండి.


ఇట్లు
భానాస వాట్సాప్ గ్రూప్ కొ ఆర్డినేటర్
మరియు
భైరి నరేష్ రాష్ట్ర అధ్యక్షుడు 7013160831

No comments:

Post a Comment

https://youtu.be/rP569otzjS0?si=3Ff66nfPs8XZcLsD

https://youtu.be/rP569otzjS0?si=3Ff66nfPs8XZcLsD