Saturday, May 29, 2021
కరోనా టీకా వేసుకున్న వారు కొన్ని అలవాట్లకు దూరంగా ఉండాలి
Wednesday, May 26, 2021
జూన్ రెండో వారంలో ఇంటర్ పరీక్షలు
మరోవైపు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) కూడా జూలైలో 12వ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ జూలై రెండో వారంలో పరీక్షల కసరత్తు చేస్తోంది. ప్రభుత్వానికి ప్రతిపాదనలను తెలిసింది. దీనిపై వారం రోజుల్లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి చర్చించి, తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే ప్రభుత్వం మాత్రం జూన్‌లో పరీక్షల నిర్వహణ వైపు మొగ్గు చూపుతుందా? జూలైలో పరీక్షల నిర్వహణకు అనుమతిస్తుందా? అన్న అంశాలపై త్వరలోనే స్పష్టత రానుంది.
సగం ప్రశ్నలకే జవాబులు
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలను నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. ప్రశ్న పత్రాలను కూడా ముద్రించింది. కరోనా కారణంగా ద్వితీయ సంవత్సర పరీక్షలను వాయిదా వేసింది. ప్రథమ సంవత్సర పరీక్షలను రద్దు చేసింది. తర్వాత వీలైనప్పుడు నిర్వహిస్తామని పేర్కొంది. ఇప్పుడు జూలైలో ద్వితీయ సంవత్సర పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ పరీక్షలకు ఇప్పటికే ముద్రించిన ప్రశ్న పత్రాలనే వినియోగించాలని భావిస్తోంది.
అయితే కరోనా, లాక్‌డౌన్ పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థులకు ఎక్కువ ఆప్షన్లు ఉండేలా చర్యలు చేపడుతోంది. ప్రశ్న పత్రంలో ముద్రించిన ప్రశ్నల్లో అన్నింటికీ కాకుండా సగం చాయిస్ ఉండేలా చర్యలు చేపడుతోంది. అంటే విద్యార్థులు సమాధానాలు రాసిన సగం ప్రశ్నలకు వేసే మార్కులను రెట్టింపు చేసి తుది మార్కులు ఇవ్వాలని భావిస్తోంది. అలాగే పరీక్ష సమయం కూడా 90 నిమిషాలకే కుదించాలని భావిస్తున్నట్లు తెలిసింది.
ఆప్షన్‌గానే ఫస్టియర్ పరీక్షలు..
జూలైలో ద్వితీయ సంవత్సర విద్యార్థులతో పాటు ప్రథమ సంవత్సర విద్యార్థులకు కూడా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. విద్యార్థుల పరీక్షలను రద్దు చేసినట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినందున, జూలైలో నిర్వహించే పరీక్షలను విద్యార్థులకు ఆప్షన్‌గానే నిర్వహించే అవకాశం ఉంది. ప్రథమ సంవత్సరం విద్యార్థులందరినీ 45 శాతం కనీస మార్కులతో పాస్ చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అయితే ఆ మార్కులు తక్కువగా ఉన్నాయని ఎవరైనా భావిస్తే.. పరీక్షలకు హాజరై మార్కులు పెంచుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. అందుకోసమే ప్రథమ సంవత్సర పరీక్షలను నిర్వహించాలని యోచిస్తోంది.
డబ్బు ఎక్కడిది అని సోనూసూద్ ని అడిగితే
కరోనా టైంలో ఇండియాలోని సూపర్ స్టార్లందరినీ మించి పోయి రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూ సూద్. గత ఏడాది లాక్ డౌన్ పెట్టాక అష్ట కష్టాలు పడుతున్న వలస కార్మికులను వారి గమ్య స్థానాలకు చేర్చడంతో మొదలుపెట్టి అతను అనితర సాధ్యమైన స్థాయిలో సేవా కార్యక్రమాలు చేపట్టాడు. ఈ ఏడాది సెకండ్ వేవ్ టైంలో మరింతగా సేవా కార్యక్రమాలను విస్తరించాడు సోనూ.
దేశవ్యాప్తంగా లక్షల మంది సాయం కోసం ప్రభుత్వాలను అడగడం మానేసి సోనూకు విజ్ఞప్తులు పెడుతుండటం గమనార్హం. అందులో సాధ్యమైనంత మందిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు సోనూ. మందులిస్తున్నాడు. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఇస్తున్నాడు. ఏకంగా ఆక్సిజన్ ప్లాంటులే ఏర్పాటు చేస్తున్నాడు. అన్నీ కూడా ఉచితమే. ఐతే ఒక్క సోనూ ఇంతమందిని ఎలా ఆదుకోగలుగుతున్నాడు.. అతడి దగ్గర అన్ని డబ్బులెక్కడివి అనే సందేహాలు అందరినీ వెంటాడుతున్నాయి.
తన ద్వారా సాయం పొందిన వాళ్ల స్పందన చూశాక, ఎన్నో ప్రాణాలు నిలబడ్డాక కలుగుతున్న సంతృప్తి మాటల్లో వర్ణించలేనిదని.. మరింతగా సేవా కార్యక్రమాలు చేపట్టడానికి అదే స్ఫూర్తిగా నిలుస్తోందని సోనూ వెల్లడించాడు. కేవలం కరోనా బాధితుల్ని ఆదుకోవడంతో తాను ఆగిపోవట్లేదని.. లాక్ డౌన్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లను ఆదుకునేందుకు భారీ ప్రణాళికలే రచించామని.. కంపెనీల భాగస్వామ్యంతో ఇప్పటికే 2 లక్షల మందికి ఉపాధి కల్పించామని.. లక్షల మందికి స్కిల్స్ నేర్పించి వారికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత చేపట్టామని సోనూ వెల్లడించాడు.
1000 కోట్లు పరువు నష్టం చెల్లించాలి..
చాలా మంది వారి బిజీ జీవనశైలి కారణంగా దీనిని పాటించరు
ఉదయాన్నే లేవడం ఆరోగ్యానికి మంచిదని అందరికి తెలుసు. కానీ చాలా మంది వారి బిజీ జీవనశైలి కారణంగా దీనిని పాటించరు. ఉదయాన్నే లేవడం ఎవరికీ ఇష్టం లేదు. కానీ ఇలా చేస్తే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మీరు రోజంతా ఆరోగ్యంగా ఉంటారు. అన్ని పనులను సకాలంలో చేయవచ్చు. నడక, వ్యాయామం, యోగా చేయవచ్చు. తొందరగా కార్యాలయానికి వెళ్ళగలుగుతారు దినచర్య పనిని పూర్తి చేయగలుగుతారు. ఉదయాన్నే నిద్రలేవడం వల్ల మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఆలస్యంగా లేచిన వారికంటే ఉదయం లేచే వ్యక్తుల తెలివితేటలు వేగంగా ఉంటాయని ఒక అధ్యయనం తెలిపింది. ఉదయం లేవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
1. అల్పాహారం మిస్ చేయవద్దు
చాలా మంది ఉదయం రష్‌లో తమ అల్పాహారం దాటవేస్తారు. ఇది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అదే సమయంలో మీరు ఉదయాన్నే మేల్కొంటే మీకు అల్పాహారం వండడానికి పూర్తి సమయం లభిస్తుంది. అల్పాహారం తీసుకోవడం ద్వారా మీరు రోజంతా శక్తిని పొందుతారు. మన ఆహారంలో అల్పాహారం ఒక ముఖ్యమైన ఆహారం. ఇది దాటవేయడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
ప్రతి ఉదయం ఉదయాన్నే వ్యాయామం, యోగా చేయాలి. వ్యాయామం శరీరంలో ఆడ్రినలిన్ హార్మోన్‌ను పెంచుతుంది. ఇది మిమ్మల్ని రోజంతా చురుకుగా ఉంచుతుంది. వ్యాయామం మిమ్మల్ని శారీరకంగా , మానసికంగా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది కాకుండా మీ మెమురీ కూడా బాగుంటుంది. ఉదయం సమయం సహజ పోషణను అందిస్తుంది.
3. రాత్రి బాగా నిద్రించండి
ఉదయాన్నే నిద్రలేవడం వల్ల రాత్రి బాగా నిద్రపడుతుంది. ఇది మీకు తగినంత సౌకర్యంగా ఉంటుంది. పూర్తి నిద్ర రావడం వల్ల ఊబకాయం, ఇతర వ్యాధులు రావు. మంచి నిద్ర పొందడం ద్వారా మీ చర్మం సహజంగా మెరుస్తుంది.
4. సమయం లభిస్తుంది
బిజీ లైఫ్ వల్ల జీవితంలో చాలా మంది ప్రజలు తమ విశ్రాంతి తీసుకోలేకపోతున్నారు. ఉదయాన్నే లేవడం మీ పనిని సమయానికి పూర్తి చేస్తుంది. మీకు మీ సమయం లభిస్తుంది. ఇలా చేయడం ద్వారా మీరు ఒత్తిడికి దూరంగా ఉంటారు. మీ నైపుణ్యాలను కూడా మెరుగుపరుచుకుంటారు.
కారం ఎక్కువగా తింటున్నారాఅయితే ఈ విషయం తెలుసుకోండి
సాధారణంగా కొందరికి ఫుడ్ స్పైసీగా ఉంటే మహా ఇష్టం.అందుకోసం కారాన్ని ఎక్కువగా వినిపయోగిస్తారు.
కారం ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక జబ్బులను తెచ్చిపెట్టుకున్నట్టే అవుతుంది.అవును, మోతాదుకు మించి కారాన్ని తీసుకుంటే.
అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.మరి అవేంటో లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.
చికాకు, చురుకుతనం తగ్గడం, తలనొప్పి వంటి సమస్యలు ఏర్పడతాయి.అలాగే కారం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆకలి కూడా ఎక్కువగా ఉంటుంది.ఈ క్రమంలోనే ఏది పడితే అది లాంగించేస్తారు.ఫలితంగా బరువు పెరుగి పోతారు.
కారాన్ని అతిగా వాడటం వల్ల జీర్ణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడి.గ్యాస్, ఎసిడిటీ, ఛాతిలో మంట, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు ఏర్పడతాయి.
ఇక కారాన్ని ఓవర్‌గా వాడటం వల్ల తరచూ తల తిరుగుడు, కళ్ళు బైర్లు కమ్మడం వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి.
కారాన్ని ఓవర్‌గా కాకుండా తగిన మోతాదులో మాత్రమే తీసుకోండి
చరిత్రలో మే 26
గుజరాత్ లో 90.92 శాతానికి చేరిన రికవరీ రేటు
ప్రభాస్ హాలీవుడ్ మూవీపై క్లారిటీ
అలా అతడు నగ్నంగా గదిలోకివచ్చి..చేదు అనుభవాన్ని బయటపెట్టినకర్జన్, మాస్టర్ నటి
మాస్టర్ చిత్రంలో నటించిన గౌరీ కిషన్
ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో విజయ్ సేతుపతి, త్రిషా జంటగా నటించిన మాస్టర్ చిత్రంలో నటించిన గౌరీ కిషన్ దిగ్బ్రాంతికరమైన విషయాలను బటపెట్టారు. గౌరీ కిషన్ ఇటీవల ధనుష్ నటించిన కర్ణన్ చిత్రంలో, విజయ్ మాస్టర్ చిత్రంలో కూడా మంచి పాత్రలను పోషించి మెప్పించారు. ఈ సందర్భంగా తన ఇన్స్‌టాగ్రామ్‌లో తన కోపాన్ని వ్యక్తం చేస్తూ పలు పోస్టులను షేర్ చేసింది.
స్కూల్ అంటే పవిత్రమైన ప్రదేశం
స్కూల్ అంటే ఎన్నో మెమొరీస్ ఉంటాయి. అలాంటి వాతావరణంలో ఇలాంటి భయాలు పిల్లలకు జీర్ణించుకోలేదు. జీవితకాలం వారిని వెంటాడుతుంటాయి. ఎంతో మంది పిల్లల మాదిరిగా నేను కూడా ఇలాంటి దారుణాలను చవి చూశాను. స్కూల్ అంటే ఎన్నో విషయాలను నేర్చుకొనే పవిత్రమైన ప్రదేశం. అలాంటి ప్రదేశంలో ఇలాంటి సంఘటనలా అంటూ కామెంట్ చేసింది.
నా స్నేహితురాలికి చేదు అనుభవమ్ పీఎస్‌బీబీ స్కూల్‌లో జరిగిన సంఘటన సందర్భంగా నా స్నేహితురాలికి జరిగిన ఓ సంఘటనను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. హిందూ సీనియర్ సెకండరీ స్కూల్‌లో జరిగిన పెద్ద సమస్యను గురించి వివరిస్తాను. నా స్కూల్‌లో ఉపాధ్యాయుడు నేరుగా బాత్రూం నుంచి దాదాపు నగ్నంగా క్లాస్‌లోకి వచ్చాడు. నా స్నేహితురాలిని లైంగికంగా వేధించాడు అని గౌరీ కిషన్ పేర్కొన్నది.
గౌరీ కిషన్ ఎడ్యుకేషన్ గురించి
గౌరి కిషన్ తన విద్యార్థి దశలో జర్నలిజం, సైకాలజీ, ఇంగ్లీష్‌లో డిగ్రీ పూర్తి చేశారు. స్కూల్‌లో అమ్మాయిలపై లైంగిక వేధింపులకు పాల్పడే వారిపై చిన్మయి చేసిన పోరాటంపై ఆమె ప్రశంసల వర్షం కురిపించారు. బాధితులకు న్యాయం జరిగేందుకు ఆమె చేసిన కృషి ఉన్నతం అంటూ గౌరీ కిషన్ కామెంట్ చేసింది.
రహస్యంగా ఆనందయ్య మందు తయారీ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆనందయ్య నాటు మందు కరోనా బాధితులు ఆసక్తిగా ఎరురు చూస్తున్నారు. ప్రస్తుతం పంపిణీ నిలిపివేశారు. అయితే, రహస్యంగా ఆనందయ్య మందును కొందరు తయారు చేస్తున్నట్లు సమాచారం. నగరంలోని ఓ క్యాటరింగ్ లో అర్ధరాత్రి ఆయుర్వేద మందు తయారు చేస్తున్నారు. ఎవ్వరికీ తెలీకుండా మందు తయారు చేసి అధికారులకు, నాయకులకు పంపిణీ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పోర్టులో తయారు చేస్తున్న మందు ఎవరికి పంపిణీ చేస్తున్నారనేది ప్రశ్నార్ధకంగా మారింది. రహస్య తయారీపై జనసేన రాష్ట్ర నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాకుండా ఎలా తయారు చేస్తారని ప్రశ్నించారు. పేదలకు మందు లేకుండా వైసీపీ నేతలు రహస్యంగా మందు తయారు చేయించుకుంటున్నారని ఆరోపించారు. కృష్ణాపట్నం పోర్టు, నగరంలోని ఓ క్యాటరింగ్ లో రహస్యంగా మందు తయారీ జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ ఈ విషయంపై స్పందిచాలని డిమాండ్ చేశారు. ఆనందయ్య మందుపై వెంటనే ప్రభుత్వ అనుమతులు తీసుకుని మందు ప్రజలకు పంపిణీ చేయాలని కోరారు.
మరోవైపు ఆనందయ్య కరోనా మందుపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. శాస్త్రీయ అధ్యయనం జరగాలని భావించిన ఏపీ ప్రభుత్వం మందును అధ్యయనం చేయాలని ఆయుష్, ఐసీఎంఆర్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే. ఆనందయ్య ఆయుర్వేద మందును పరిశీలించిన ఆయుష్ బృందం.. మందు తయారీ విధానంలో వినియోగించిన పదార్థాలన్నీ శాస్త్రీయంగానే ఉన్నాయని తెలిపింది. తయారీ పదార్థాలపై ల్యాబ్ రిపోర్ట్ పాజిటివ్‌గానే వచ్చినట్లు ఆయుష్ కమిషనర్ రాములు చెప్పారు. ఆనందయ్య తయారు చేసిన మందు హానికరం కూడా కాదని తెలిపారు. ఈ మందు కోసం వాడే పదార్థాలన్నీ వంటింటి ఔషధాలు, ప్రకృతి వనమూలికలేనని, కోవిడ్ బాధితులకు ఉపశమనం కలిగిస్తోందని అభిప్రాయపడ్డారు. ఐసీఎంఆర్ కూడా మందుపై అధ్యయనం చేస్తోంది. మందుపై అధ్యయనానికి సుమారు వారం నుంచి పది రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మందుపై శాస్త్రీయ అధ్యయనం పూర్తయి.. నివేదిక వచ్చే వరకూ పంపిణీకి అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. అప్పటి వరకూ బాధితులెవరూ కృష్ణపట్నం రావొద్దని సూచిస్తున్నారు.
సుడిగాలి సుదీర్ నా బావ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన యాంకర్
Sunday, May 23, 2021
Shreya Ghoshal ఒక బిడ్డకు జన్మనిచ్చింది
Wednesday, May 19, 2021
Friday, May 14, 2021
బాలకృష్ణ చిత్రం నుంచి పవన్ కళ్యాణ్ చేతి కి వెళ్ళిన ప్రాజెక్ట్
బ్లాక్ ఫంగస్
తీపి తగినవాడు పళ్ళు
యువతి కారణంతో ఓడిపోయింది ఆమె గుండె ఆగిపోయింది
vtv telugu Please subscribe and like and share
సంపూర్ణ లాక్‌డౌన్ దిశగా ఆంధ్ర ప్రదేశ్
Thursday, May 13, 2021
తెలంగాణలో మూడు రోజుల్లోనే భారీగా మద్యంఅమ్మకాలు
https://youtu.be/rP569otzjS0?si=3Ff66nfPs8XZcLsD
https://youtu.be/rP569otzjS0?si=3Ff66nfPs8XZcLsD
-
'మిషన్ ఇంపాజిబుల్ 7' చిత్రంతో ప్రభాస్ హాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నాడని ఓ వార్త సోషల్మీడియాను షేక్ చేసింది. అది తన వరకు రావ...
-
గురువారం. *ఒంగోలులో ఆనందయ్య కరోనాకు మందును ఏడువేల మందికి పంపిణీ చేసిన* *ఒంగోలు పార్లమెంట్ సభ్యులు* *శ్రీ మాగుంట శ్రీ...
-
లక్నో: యూపీలోని కాన్పూర్ నగర్‌లోని సచెండి ప్రాంతంలో మంగళవారం రాత్రి ఎదురుగా వస్తున్న టెంపో డబుల్ డెక్కర్ బస్సును డికొనడంతో 17 మ...